Madras High Court: పెళ్లికి ముందు ఎంతో పద్దతిగా ఒద్దికగా ఉండే కొందరు యువతులు.. పెళ్లయ్యాక మారిపోతారు. కొందరైతే భర్తలకు చుక్కలు చూపిస్తారు.. స్వేచ్ఛ స్వాతంత్య్రాల పేరుతో హింసిస్తారు. భర్త గదమాయిస్తే ‘గృహ హింస’; వరకట్నం కేసులు పెడుతారు. పాపం భర్తలు ఇవన్నీ మౌనంగా భరిస్తూ చస్తుంటారు. అయితే అందరూ అణిగిమణిగి ఉండరు.. కొందరు భార్యల టార్చర్ తట్టుకోలేక హైకోర్టుకు ఎక్కుతారు. విడాకుల కోసం వేడుకుంటారు. అయితే సరైన కారణాలు ఉంటేనే కోర్టులు విడాకులు మంజూరు చేస్తాయి. కానీ ఇక్కడో భార్య ‘మంగళసూత్రం’ తీసేసి హింసించడం ప్రారంభించింది. ఆమెకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

హిందూ సంప్రదాయంలో పెళ్లైన మహిళలు తాళి ధరించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అది తీసేస్తే భర్తకు అపాయం అని.. మంచిది కాదని భావిస్తారు. కానీ ఈ కాలం మోడ్రన్ మహిళలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఈజీగా తాళి తీసేసి తమ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వేడుకల్లో దర్జాగా తిరిగేస్తున్నారు. ఇలాంటి వారికి మద్రాస్ హైకోర్టు కాస్త గట్టిగానే షాకిచ్చింది.
Also Read: Haryana Husband and Wife: పక్కింటి వాడితో భార్య పరార్.. ఆ భర్త ఇచ్చిన షాక్ మామూలుగా లేదు?
పెళ్లి చేసుకున్న మహిళలు మెడలో తాళిని తీసేయడమంటే భర్తలో క్రూరత్వాన్ని పెంచి పోషించడమేనని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. తనకు విడాకులు ఇవ్వడానికి స్థానిక ఫ్యామిలీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అయితే ఆయన అప్పీల్ ను అనుమతిస్తూ వీఎం వేలుమణి, ఎస్ సౌంథర్ లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. తన భార్య అకారణంగా తాళి తీసేయడాన్ని కారణంగా చూపిస్తూ సదరు వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరాడు. దీంతో స్థానిక కోర్టు విడాకులను నిరాకరించింది. కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం ఫ్యామిలీ కోర్టు తీర్పును తప్పుపడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడుకు చెందిన శివకుమార్ ఈరోడ్ వైద్యకళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఈయన తన భార్య అకారణంగా మెడలో నుంచి తాళి తీసివేసిందని, తాము ఎంతో పవిత్రంగా భావించే తాళిని తీసేయడం భావ్యం కాదని, ఇందులో భాగంగా విడాకులు మంజూరు చేయాలని స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే భార్య తరుపున న్యాయవాది వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం తాళి తప్పనిసరి కాదని వాదించారు. ఇది వైవాహిక బంధంపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. ఫ్యామిలీ కోర్టులో శివకుమార్ కు విడాకులు మంజూరు చేయలేదు. దీంతో శివకుమార్ మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. శివకుమార్ భార్యను తాళి తీసేయడంపై ప్రశ్నించగా నిజమేనని ఒప్పుకుంది. అయితే గొలుసును మాత్రమే తీసేశానని, తాళిని మెడలోనే ఉంచుకున్నానని తెలిపింది.
‘స్త్రీ మెడలో తాళి అనేది పవిత్రమైన విషయం. ఇది వైవాహిక జీవితాన్ని కొనసాగించేందుకు సూచిస్తుంది. తాళి అనేది ఆమె భర్త మరణించినప్పుడు మాత్రమే తొలగిస్తారు. కాబట్టి పిటిషనర్ భార్య దానిని తొలగించడం మానసికంగా హింసించడంగానే భావించవచ్చు. ఇలా చేయడం భర్తను మానసికంగా తీవ్రంగా బాధించే విషయం. ఈ విషయంలో భర్తలో క్రూరత్వాన్ని పెంపొందిస్తుంది’ అని బెంచ్ పేర్కొంది.

తాళిని తరుచుగా తీసేయడం అనాలోచిత నిర్ణయంగా హైకోర్టు అభివర్ణించింది. ‘వైవాహిక బంధం తెగడానికి తాళి గొలుసును తీసివేస్తే సరిపోతుందని మేం చెప్పలేం. కానీ ఆమె భర్త చెప్పే ఉద్దేశాన్ని అంచనా వేసినప్పుడు ఇక్కడ విడాకులు అవసరమని గుర్తించామని’ బెంచ్ తెలపింది. అంతేకాకుండా భర్తపై వివాహేతర సంబంధం అంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. దీంతో ఆమె భర్త ఆ రకంగానూ మానసికంగా కుంగిపోయారు. అంతేకాకుండా 2011 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో మళ్లీ వీరి కలయిక ఉంటుందని అనుకోలేం. అందువల్ల ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన తరువాత శివకుమార్ కు విడాకులు మంజూరు చేయడమే కరెక్ట్’ అని బెంచ్ పేర్కొంది.
ఇలా తాళి తీసేసి భర్తలను హింసించే వారికి ఇదొక గుణపాఠంగా చెప్పొచ్చు. తాళి అంటే పవిత్రంగా భావించే వాళ్లు ఉంటారు. వారి మనోభావాలకు అనుగుణంగా ఈ మహిళలు నడుచుకోవాల్సి ఉంటుంది. తేడా కొడితే ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయి.
Also Read:Food Safety and Standards in AP: ఏపీలో ఆహారం తినేవాళ్లందరికీ హెచ్చరిక.. కాస్త ఆగండి..
[…] […]