Haryana Husband and Wife: తెంచుకుంటె తెగి పోతుందా దేవుడు వేసిన బంధం అన్నారో సినీకవి. భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత, అనురాగం అంతటి స్థాయిలో ఉండటం తెలిసిందే. తెలిసి మసలుకుంటే జీవితాంతం దీపమై వెలుగునిస్తుంది భార్య. అశ్రద్ధ చేస్తే ఆ దీపమే నీ జీవితాన్ని తగులబెడుతుంది. అపురూపమైన అందమైన కాపురం కలకాలం సాగాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండాలి. అనురాగం చిగురించాలి. ఆప్యాయత పెనవేసుకోవాలి. భార్యను సంతోష పెట్టడం తేలికైన పనే. కానీ కొందరు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చి జీవిత భాగస్వామిని అసలు పట్టించుకోరు. దీంతో ఆమె తన సుఖం తాను చూసుకుంటే తట్టుకోలేరు. అన్నింటికి మగాడి తప్పేమీ ఉండదు. కొన్ని విషయాల్లో ఆడవారి పొరపాట్లు కూడా ఉంటాయి. కానీ వాటిని సరిదిద్దుకుని జీవితాన్ని నందనవనం చేసుకోవడమే మగాడిగా మనపని.

తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బుధ్ నగర్ కు చెందిన కవీందర్ తన భార్యతో కలిసి గురుగ్రామ్ దగ్గరలోని కసన్ గ్రామంలోనివాసం ఉంటున్నాడు. అతడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్న దాంట్లో తృప్తిగానే ఉంటున్నారు. కానీ కవీందర్ భార్య చూపు పక్కింటి వ్యక్తిపై పడింది. ఇంకేముంది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు తరచు కలుసుకోవడం కోరికలు తీర్చుకోవడం జరుగుతున్నాయి. దీంతో ఏమనుకున్నారో ఏమో కానీ ఓ రోజు ఇంటి నుంచి ఇద్దరు పారిపోయారు.
Also Read: Food Safety and Standards in AP: ఏపీలో ఆహారం తినేవాళ్లందరికీ హెచ్చరిక.. కాస్త ఆగండి..
దీంతో భర్త కవీందర్ గుండె చెరువైంది. దీనంగా ఏడ్చాడు. మౌనంగా రోదించాడు. పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ తనకు ఈ జీవితం ఎందుకని కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న కవీందర్ ను సోదరుడు సంతోష్ కుమార్ ఆస్పత్రికి తరలించాడు. కానీ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. భార్య చేసిన పనికి భర్త బలికావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సోదరుడు సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు భార్య రీనా, ప్రియుడు రాంవీర్ పై కేసులు నమోదయ్యాయి.

రాంవీర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి చావుకు కారణమైన వారిని విడిచిపెట్టొద్దనే డిమాండ్లు వస్తున్నాయి. పచ్చని సంసారంలో నిప్పులుపోసి భార్యాభర్తలను విడదీసిన రాంవీర్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మొత్తానికి చేయని తప్పుకు కవీందర్ బలయ్యాడు. భార్య చేసిన పనికి తల ఎత్తుకోలేక తనువు చాలించాడు. పెళ్లి నాడు చేసుకున్న ప్రమాణాలు ఏవి? బాసలు ఏవి? అన్ని వట్టివేనా? రీనా తీరుతో కవీందర్ ఈ లోకాన్నే విడిచిపెట్టిపోవడం సంచలనం సృష్టించింది.
Also Read:GoodMorningCMSir : జగన్ కాచుకో.. నేటి నుంచే పవన్ కళ్యాణ్ ‘డిజిటల్ వార్’ షురూ..
[…] […]