బండి సంజయ్ ఆస్తులు రూ.600 కోట్లు అని ప్రచారం..

తెలంగాణలో కొన్ని రోజులుగా పట్టు సాధిస్తున్న బీజేపీపై కొత్త ప్రచారం పుట్టుకొస్తోంది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్తులు భారీగా పెరిగినట్లు కథనాలు వెలవడ్డాయని ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. అయితే అది కొందరు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వార్త బీజేపీలో ఉన్న వివేక్ చెందిన పత్రికలోనే రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ వార్తపై మండిపడుతున్నారు. అయితే ఆ స్టోరీ ఏంటో […]

Written By: NARESH, Updated On : March 10, 2021 5:47 pm
Follow us on

తెలంగాణలో కొన్ని రోజులుగా పట్టు సాధిస్తున్న బీజేపీపై కొత్త ప్రచారం పుట్టుకొస్తోంది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్తులు భారీగా పెరిగినట్లు కథనాలు వెలవడ్డాయని ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. అయితే అది కొందరు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వార్త బీజేపీలో ఉన్న వివేక్ చెందిన పత్రికలోనే రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ వార్తపై మండిపడుతున్నారు. అయితే ఆ స్టోరీ ఏంటో చూద్దాం..

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్తులు రూ.600 కోట్లు..? అనే శీర్షికతో వెలుగు దిన పత్రికలో కథనం వచ్చినట్లు కొందరు దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీగా గెలిచిన కొద్ది రోజుల్లేనే ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారు..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.అంతేకాకుండా ఢిల్లీ కంపెనీలో రూ.50 కోట్ల పెట్టుబడులు, కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి వద్ద రూ.3 కోట్ల వ్యవసాయ భూమి ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

అలాగే హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో రూ.75 కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారని ఆ పేపర్లో రాసినట్లు క్లిప్పింగ్ పెట్టారు. దీంతో ఈ క్లిప్పింగ్ ను టీఆర్ఎస్ కు చెందిన వారు వైరల్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బండి సంజయ్ కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు కొనసాగిస్తున్నాడు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు ఇది అస్త్రంగా మారింది.