Brahmastra Movie Review: రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది. 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించడంతో పాటు ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకున్నారు. మరి ఈ సినిమా ఎలా రివ్యూ చూద్దాం రండి.

కథ :
బ్రహ్మాస్త్ర ని కాపాడుతున్న బ్రహ్మాన్ష్ గ్రూప్ చుట్టూ ఈ కథ సాగుతుంది. బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం అనీష్(నాగార్జున) వద్ద, రెండవ భాగం మోహన్ భార్గవ్(అమితాబ్ బచ్చన్) అనే శాస్త్రవేత్త వద్ద ఉంటుంది. అలాగే మూడో భాగం ఎక్కడుంది? అనేది సస్పెన్స్. మొత్తానికి విడి విడిగా ఉన్న ఈ మూడు భాగాలను కలపడం ద్వారా అద్భుత శక్తివంతమైన బ్రహ్మాస్త్ర ని పొందాలని మౌనీ రాయ్ అండ్ విలన్ గ్రూప్ అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో జరిగే అనేక నాటకీయ పరిణామాల మధ్య కథలోకి డీజే శివ(రణబీర్ కపూర్) ఎంట్రీ ఇస్తాడు. అసలు శివకు బ్రహ్మాస్త్రకి మధ్య సంబంధం ఏమిటీ ? ఇంతకు మూడవ భాగం ఎక్కడ ఉంది ? చివరకు విలన్ గ్రూప్ కోరుకున్న బ్రహ్మాస్త్రం ను సాధించారా ?, లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
బ్రహ్మాస్త్రం కోసం సాగే ఈ కథలో రణబీర్ పాత్ర తనకు వచ్చిన సమస్య కోసం ఏం చేశాడు ?, బ్రహ్మాస్త్ర ఇచ్చిన ఆదేశం కోసం ఏం సాధించాడు ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్ అలాగే హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ బాగున్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపులు, మరియు ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. నటి నటీనటుల విషయానికి వస్తే.. రణబీర్ బాగా నటించాడు. అలాగే అలియా కూడా బాగా నటించింది. అన్నిటికీ మించి ఆలియా ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంది. చాలా బాగా నటించింది.
ఇక ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల వర్క్ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రణబీర్ – ఆలియా ల మధ్య వచ్చే సన్నివేశాల్లోని నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయితే, అనవసర సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

ఇక అమితాబ్ – నాగ్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో ఉన్న లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అమితాబ్ కూడా తన పాత్రతో మెప్పిస్తారు.
ప్లస్ పాయింట్స్ :
అడ్వెంచర్ సీన్స్,
మెయిన్ థీమ,
రణబీర్ – అమితాబ్ – నాగార్జున – అలియా నటన,
కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్,
సంగీతం.
మైనస్ పాయింట్స్ :
స్లో సాగే కథనం,
కన్ ఫ్యూజన్ సాగే పాత్రలు,
తీర్పు :
హిస్టారికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ
బ్రహ్మాస్త్ర చిత్రంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రణబీర్ – అమితాబ్ తమ నటనతో ఈ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది.
2.75 / 5