Rahul Gandhi : రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో ఊరటనిచ్చింది. శిక్ష విషయంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రాహుల్ గాంధీ తప్పు చేయలేదని తెలుపలేదు. మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలన్నది ఆలోచించాలని.. చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఒక విధంగా ఆయన్ని సుప్రీంకోర్టు సేవ్ చేసింది.
సుప్రీంకోర్టులో అభిషేక్ మనుసింగ్ కొత్త వాదన లేవనెత్తారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని మోడీని విమర్శించిన రాహుల్ కు ఇదివరకు సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. మోడీపై అలాంటి మాటలు మాట్లాడవద్దని హెచ్చరించింది. దీనికి రాహుల్ సారీ కూడా సుప్రీంకోర్టులో చెప్పారు. అయితే ఇది కోలార్ లో మాట్లాడింది అంతకుముందు అని రాహుల్ లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ ఉల్లంగించలేదని స్పష్టం చేశారు. దీన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.
శిక్ష విషయంలో సుప్రీంకోర్టు ఏమీ మినహాయింపు ఇవ్వలేదు. రాహుల్ మాట్లాడినదానికి సుప్రీంకోర్టు సమర్థించలేదు. మీరు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. రాహుల్ మాట్లాడింది కరెక్ట్ అని సుప్రీం చెప్పలేదు.
దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.