Rahul Gandhi Leadership Qualities: రాహుల్ గాంధీ ఎందుకు దేశంలో బలమైన నాయకుడు కాలేకపోయాడో నిన్న లోక్ సభ ప్రసంగం వింటే అర్థమైపోతోంది. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన పార్టీకి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఎన్నో దఫాలుగా ఎంపీగా గెలిచిన వ్యక్తి.. మాట్లాడే పద్ధతి చూస్తే అతడిలోని అపరిపక్వత బయటపడుతోంది. లోక్ సభ స్పీకర్ ను పట్టుకొని ‘చైర్మన్’ సాబ్ అని రాహుల్ పలికిన మాట విని ఎంపీలంతా ఘోల్లుమన్న పరిస్థితి నెలకొంది.

ఈ ఒక్కటే కాదు.. స్పీకర్ తో మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ వెనక్కి తిరిగి తన ఎంపీలతో మాట్లాడిన విధానం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన తోటి సీనియర్ ఎంపీ పిలిచి తిరిగి ఆ సీట్లో కూర్చుండబెట్టి మాట్లాడబట్టి ఆయన పరువు కాపాడగలిగారు.
Also Read: మెగా వేలం వేళ ఫ్రాంచైజీల వ్యూహాలు.. హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్ వీళ్లే..!
హుందాతనం లేని.. అపరిపక్వత కలిగిన ఎకైక వ్యక్తి పార్లమెంట్ లో ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అని చెప్పొచ్చు. ఆయనకన్నా.. కాంగ్రెస్ లో ఎంతో మంది సమస్యలపై మాట్లాడే సత్తా ఉంది. రాహుల్ తో పోల్చితే ఎంతో మంది మెరుగైన వాక్చుత్యార్యం గల కాంగ్రెస్ నేతలున్నారు.
నిన్నటి ఎపిసోడ్ చాలు.. కాంగ్రెస్ నాయకత్వ పరిస్థితి తెలుసుకోవడానికి.. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఎందుకు లేవో తెలుపడానికి.. రాహుల్ గాంధీ లీడర్ షిప్ పై ‘రామ్’ టాక్ సునిశిత విశ్లేషణకు కింది వీడియోలో చూడొచ్చు.
