KCR Prashanth Kishore: కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకొని ముందుకెళుతాడట.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే వ్యూహాలతోనే బరిలోకి దిగుతాడట.. అసలు ఎన్నికై కేసీఆర్ రెండున్నరేళ్లు అయ్యింది. ఇంకా రెండున్నరేళ్ల పాలన మిగిలి ఉంది. అప్పుడే కేసీఆర్ కు ఎన్నికల జ్వరం ఎందుకు పట్టుకుందన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

కేసీఆర్ ప్రస్తుతం దృష్టి పెట్టాల్సింది ఎన్నికల మీద కాదు.. పరిపాలన మీద.. ప్రజా సంక్షేమం మీద.. ప్రజలకు ఈ రెండు సంవత్సరాలు ఎలా మేలు చేయాలన్న మీద ఫోకస్ చేయాలి.
కేసీఆర్ శక్తియుక్తులన్నీ ఇప్పుడు మీడియాను మేనేజ్ చేసుకొని బీజేపీని ఏ విధంగా దెబ్బతీయాలన్నదే కనపడుతోంది తప్పితే.. అసలు పరిపాలన మీద కేసీఆర్ దృష్టి పెట్టడం లేదు. మీడియాను ఎందుకు మేనేజ్ చేసుకున్నారని చెప్తున్నారంటే.. దేశం మొత్తం మీద పెట్రోల్, డీజీల్ పై తగ్గించినా.. తెలుగు రాష్ట్రాలు మాత్రం రూపాయి తగ్గించలేదు.
Also Read: బాక్సాఫీస్ వద్ద జీరో అయ్యాడు. ఓటీటీలోనైనా ‘హీరో’ అవుతాడా ?
ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా మీడియా ఉంది. కానీ తెలంగాణలో అసలు ఏ మీడియా కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగానే అన్ని మీడియా సంస్థలు ఉండడంతో కేసీఆర్ అంటే కాస్త భయం మీడియాలో నెలకొంది.
సరే .. కేసీఆర్ వ్యూహం ఏంటి.? ప్రశాంత్ కిషోర్ లాంటి అపర చాణక్యుడు లాంటి రాజకీయ వ్యూహకర్తను తీసుకొచ్చి కేసీఆర్ ఎన్నికల గెలవాలన్న ప్రయత్నం నెరవేరుతుందా? పీకే రాకతో తెలంగాణలో పూర్తిగా కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గుతారా? ఎక్కడ గెలవని చోట పీకే వస్తే గెలుస్తాడా? పీకే ట్రాక్ రికార్డ్ ఏంటి? పీకేతో జత కట్టడం వల్ల కేసీఆర్ తెలంగాణలో గెలుస్తాడా? అనే విషయాలపై ‘రామ్ ’గారి సునిశిత విశ్లేషణ వీడియో కింద చూడొచ్చు.
