AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పీఆర్సీ రగడ రేగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు సమ్మె చేయడనికి వెనుకాడటం లేదు. ఈనెల 7 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం విద్యాశాఖలో సైతం మార్పులు చేయాలని భావిస్తోంది. దీనికి గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాని నిర్ణయిస్తోంది. దీనికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనికి గాను ప్రణాళికలు రచిస్తోంది. నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీంతో అన్ని చర్యలు తీసుకుంటోంది. విద్యా విధానంతో పాఠశాలల రూపురేఖలు మార్చాలని ఆలోచిస్తోంది. దీనికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలు మూతపడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయిస్తున్నారు.
Also Read: తగ్గేదేలే.. 7 నుంచే ఉద్యోగుల సమ్మె.. జగన్ సర్కార్ కు అల్టిమేటం..
రాష్ట్రంలో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అర్హతల వారీగా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు తీపి కబురు అందించాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే వారికి ఇవ్వాల్సిన పదోన్నతులపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు కూడా నిర్ణయించినట్లు సమాచారం.
కొన్ని ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మార్చాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి మండలంలో రెండు హైస్కూళ్లను జూనియర్ కళాశాలలుగా చేయాలని భావిస్తున్నారు. దీనికి గాను ఎన్నో మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వీటికి సంబంధించిన కసరత్తు అప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో జగన్ పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
Also Read: జనసంద్రమైన విజయవాడ.. అండర్‌గ్రౌండ్‌లోకి ఉద్యోగసంఘాల నేతలు