https://oktelugu.com/

Pakistan : పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు

ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ భగ్గుమన్నది. ఆయనే ప్రజలు, తన పార్టీ నేతలను తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు. దీంతో ఆ పార్టీ నేతలు, సానుభూతి పరులు ఆర్మీపై దండెత్తారు. 

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2023 10:23 pm
    Follow us on

    Pakistan : పాకిస్తాన్ దేశంలో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మూలాలు దెబ్బ తింటున్నాయి. పరిస్థితులు చేజారిపోతున్నాయి. రూపాయి విలువ పడిపోతుంది. ఫలితంగా నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 250 దాటింది. డీజిల్ ధర అంతే పలుకుతోంది. దీంతో సామాన్యుడు చతికిల పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దేశంలో ధరలు ఇలా పెరిగితే భవిష్యత్ లో మరిన్ని కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్నేహహస్తం అందించాలని సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను అభ్యర్థిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా సాయం చేయాలని కోరుతోంది. కానీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉండటంతో ఏ దేశం కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో పాక్ భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకమే. దీంతో పాకిస్తాన్ కోలుకునే అవకాశాలు కానరావడం లేదు. ఇంకింత అగాధంలోకి పడిపోయే ప్రమాదమే కనిపిస్తోంది.

    ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ భగ్గుమన్నది. ఆయనే ప్రజలు, తన పార్టీ నేతలను తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు. దీంతో ఆ పార్టీ నేతలు, సానుభూతి పరులు ఆర్మీపై దండెత్తారు. 

    తాజాగా దేశాన్ని నడిపిస్తున్న పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆ దేశంలో తీవ్ర నిరసనలు సాగుతున్నాయి. పాకిస్తాన్ లోని పరిస్థితులపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.