Ramabanam Collections: ‘రామబాణం’ క్లోసింగ్ కలెక్షన్స్..పాపం పబ్లిసిటీ కి అయిన ఖర్చులు కూడా రాలేదు!

క్లోసింగ్ కలెక్షన్స్ చివరికి నాలుగు కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చిందని సమాచారం. అంటే కనీసం పబ్లిసిటీ కి పెట్టిన డబ్బులను కూడా రాబట్టలేకపోయింది ఈ రామబాణం.ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ గోపీచంద్ కెరీర్ లోనే లేదని చెప్పొచ్చు.

Written By: Vicky, Updated On : May 14, 2023 8:11 am
Follow us on

Ramabanam Collections: ‘పక్కా కమర్షియల్’ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత గోపీచంద్ చేసిన చిత్రం ‘రామబాణం’.రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది.ఒక రెండు మూడు పాటలు సూపర్ హిట్ అయ్యి, టీజర్ మరియు ట్రైలర్ వంటివి క్లిక్ అయినా కమర్షియల్ గా యావరేజి గ్రాసర్ గా అయినా మిగిలేది.

కానీ టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ఇలా అన్నీ కూడా నాసిరకంగా ఉండడం తో అటు ఓపెనింగ్స్ లేక, ఇటు లాంగ్ రన్ లేక ఓవరాల్ గా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్ర దర్శకుడితో గతం గోపీచంద్ ‘లక్ష్యం’ మరియు ‘లౌక్యం’ సినిమాలు చేసాడు. ఈ రెండు కూడా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

అలా కాంబినేషన్ కావడం తో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ రేట్స్ కి అమ్ముకుంది. సుమారుగా 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం.ఇక సినిమాకి ప్రొమోషన్స్ కూడా సోషల్ మీడియా నుండి, ఈవెంట్స్ వరకు ఒక రేంజ్ డెడికేషన్ తో చేసారు నిర్మాతలు. కేవలం ప్రొమోషన్స్ కోసమే ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసారని సమాచారం. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు కేవలం 4 కోట్ల రూపాయిలు మాత్రమే.

షేర్ వసూళ్లు కమిషన్ బేసిస్ మీద కూడా ఆరవ రోజు నుండి రాలేదు. దాంతో క్లోసింగ్ కలెక్షన్స్ చివరికి నాలుగు కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చిందని సమాచారం. అంటే కనీసం పబ్లిసిటీ కి పెట్టిన డబ్బులను కూడా రాబట్టలేకపోయింది ఈ రామబాణం.ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ గోపీచంద్ కెరీర్ లోనే లేదని చెప్పొచ్చు.