ప్రాణాలు ఫణంగా 16సంవత్సరాలు ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని దీక్షపూనిన ఒక ఉద్యమకారిణికి వంద కూడా దాటకుండా ఓట్లేసి ఓడించిన దేశంలో, ఒక్క పోరాటం చేయకుండానే మొదటి సారే రాష్ట్రాల్ని పాలించే అధికారమివ్వడానికి ఒకే ఒక కారణం, ఈ పోరాటాల్ని సినిమాలో తెరమీద చేయడం.

సినిమాల్ని జీవితంలో భాగం చేసుకున్న జాతి, తమ ప్రధానుల్ని యుద్ద దుస్తుల్లో చూడగానే ఉద్విగ్నంతో ఓట్లు గుద్దేసి వీరుడిని చేస్తున్న సంస్కృతిలో భాగంగానే ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మనదేశంలో కూడా ఒక ప్రధాని సైనిక దుస్తులేసుకుని ప్రజల్ని అలరిస్తారు.
ఇదే ఒరవడి ఉక్రెయిన్ పాలకుడిది. ఇతడొక నటుడు, రొమాంటిక్ హీరో, కమెడియన్ (సినిమాలు, సీరియళ్ల లిస్టు కోసం గూగుల్ చేయండి). వాస్తవ జీవితంలోని పేదరికం, కష్టాలు, కన్నీళ్లూ సినిమాల్లో చూసుకునే మనిషి బలహీనతల్ని సొమ్ము చేసుకుని ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచాడు. ఇతడు ఒక అవినీతిపరుడు, పండోరా పేపర్ల ప్రకారం ఇతర దీవుల్లో డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవాడు. యూరోపియన్ ముఖ్యంగా అమెరికా దేశానికి నమ్మిన బంటు. ఈ నేపధ్యంలో ఎన్నికైన ఇతడు, తన నటనను కొనసాగిస్తూ ఇలా మిలిటరీ దుస్తుల్లో యుద్దానికి బయల్దేరుతున్నట్లు నటిస్తూ ఫోజులిస్తున్నాడు. అమాయక ప్రజల్ని యుద్దంలోకి ఆహ్వానిస్తున్నాడు.
నిజానికి ఏ దేశంలో కూడా అధ్యక్షుడు యుద్దంలో స్వయంగా పాల్గొనడు. కేవలం రాజుల కాలంలో తప్ప. కాదూ ఈ కాలంలోనూ ఇలా చేస్తున్నాడంటే అది నటనలో భాగం. కేవలం ఇతడి కారణంగానే ఉక్రెయిన్ రష్యా దాడికి దిగిందని మరువరాదు. అటుపక్క, ఇటుపక్క అమాయక జనం యాతనలు అనుభవిస్తున్నారని గుర్తించాలి. అన్ని దేశాలకూ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్దానంతరం ప్రతి దేశపు రాజకీయాల్లో కలుగజేసుకుని వాటిని వీలైనంత ధ్వంసం చేసిన అమెరికాతనం గమనించాలి. ఇక రెండు ప్రపంచ యుద్దాలకు మూలమైన జర్మనీ ఏం చేస్తుందో, రష్యా ఏం సాధించుకుందో వనరులు, వ్యూహాలు, భద్రతలు, అవసరాలు.. అవగాహన చేసుకుని మాట్లాడాలి.
రాసిపెట్టుకోండి, వీడొక ఈయనకొన మోసకారి..! ఈయన వెనుక వాటాలు పంచుకునేవారు వేరు. దోచుకోబడింది మాత్రం ఉక్రెయిన్ ప్రజల కన్నీరు, స్వేదం, నెత్తురు, ప్రాణాలు..
-సిద్ధార్తి