https://oktelugu.com/

India–Russia Relations: భారత్ కు రష్యా సాయం.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?

India–Russia Relations: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం మొత్తం నిషేధాలు విధిస్తోంది. కానీ రష్యా మాత్రం లెక్కచేయడం లేదు. అమెరికా వాణిజ్యపరంగా రష్యాపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్నా పెడచెవిన పెడుతోంది. దీంతో రష్యాను అన్ని దేశాలు టార్గెట్ చేసుకున్నాయి. యుద్ధం వద్దని వారిస్తున్నాయి. యుద్ధంతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాతో పాటు నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2022 / 11:02 AM IST
    Follow us on

    India–Russia Relations: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం మొత్తం నిషేధాలు విధిస్తోంది. కానీ రష్యా మాత్రం లెక్కచేయడం లేదు. అమెరికా వాణిజ్యపరంగా రష్యాపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్నా పెడచెవిన పెడుతోంది. దీంతో రష్యాను అన్ని దేశాలు టార్గెట్ చేసుకున్నాయి. యుద్ధం వద్దని వారిస్తున్నాయి. యుద్ధంతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాతో పాటు నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రష్యా ఏకాగిగా మిగిలిపోతోంది.

    India–Russia Relations

    రష్యా విధానాలతో మనదేశానికి కూడా నష్టమే జరిగే అవకాశాలున్నా పుతిన్ నుంచి మనకు సానుకూల అంశాలు వస్తున్నాయి. చమురు ఉత్పత్తులపై అంతర్జాతయ సమాజం ఆంక్షలు విధిస్తున్న సందర్భంలో రష్యా వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో వాటిని విక్రయించే నిమిత్తం రష్యా దాని మిత్ర దేశాలకు తక్కువ ధరకే ఇవ్వాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇండియాకు కూడా భారీ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరకే పెట్రో ఉత్పత్తులు సరఫరా చేస్తామని చెప్పడంతో ఇండియా మాత్రం దానికి సమాధానం ఇవ్వలేదు.

    Also Read:  తెలంగాణలో బీజేపీ భారీ ప్లాన్లు.. ఇలా అయితే కేసీఆర్ కు కష్టమే?

    ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉండటంతో ఇప్పుడు రష్యా ఇస్తున్న ఆఫర్ పై భారత్ ఆచితూచి స్పందిస్తోంది. సరే నంటే ఎలాంటి ఫలితాలు వస్తాయోననే అనుమానంతో రష్యా ఆఫర్ కు ఒకే చెప్పడం లేదు. నాటో, ఈయూ. అమెరికా లాంటి దేశాలన్ని రష్యాపై కోపంతో ఉన్న కారణంగా ఇప్పుడు మన దేశం రష్యా ఆఫర్ కు స్పందిస్తే ఆ దేశాలతో వచ్చే నష్టాలపై కూడా బేరీజు వేసుకుంటోంది. భవిష్యత్ పరిణామాలపై ప్రధానంగా ఆలోచిస్తోంది.

    India–Russia Relations

    ప్రపంచ దేశాల నిషేధాలతో రష్యా ఒంటరిగా మిగిలినా మన దేశం మాత్రం దానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా నోరు మెదపలేదు. అందుకే రష్యా మన దేశానికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిళ్ల మేరకు ఇండియా ఎలా స్పందిస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే శ్రీలంకలో సెట్రో ధరలు డబుల్ సెంచరీ దాటిన సందర్భంలో మన దేశం తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

    Also Read:  పంజాబ్ కొత్త ఆప్ ప్రభుత్వాన్ని నడిపించనున్న తెలుగుబిడ్డ.. ఐఏఎస్ వేణుప్రసాద్ కు కీలక పోస్ట్

    Tags