spot_img
Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Sai Srinivas Engagement: గ్రాండ్ గా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న...

Bellamkonda Sai Srinivas Engagement: గ్రాండ్ గా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Sai Srinivas Engagement: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ఈ నేపథ్యం లో ప్రముఖ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas) కూడా ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. గత కొంతకాలంగా ఆయన కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడు. వీళ్లిద్దరు కలిసి హైదరాబాద్ లో తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎవరీ అమ్మాయి ?, సినీ ఇండస్ట్రీ కి చెందిందా ?, లేదా బయట అమ్మాయా? అని చర్చించుకునేవారు నెటిజెన్స్. ఇక ఆ చర్చలకు తెరపడినట్టే. నిన్న హైదరాబాద్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి లకు గ్రాండ్ గ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఈ నిశ్చితార్దానికి వచ్చారు.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..

బోయపాటి శ్రీను , సంయుక్త మీనన్ , మంచు మనోజ్, నారా రోహిత్ వంటి వారు ఈ నిశ్చితార్ధ కార్యక్రమానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకీ ఈ కావ్య రెడ్డి ఎవరూ ?, ఎక్కడి నుండి వచ్చిన అమ్మాయి ?, ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి వంటి వివరాలు ఒకసారి చూద్దాం. కచ్చితంగా ఈమె సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదు, ఆమె తండ్రి హైదరాబాద్ సిటీ లోనే ఒక పెద్ద లాయర్, అదే విధంగా ఈమె తాత హై కోర్టు లో జడ్జీ గా కూడా పని చేసాడు. హైదరాబాద్ లోనే అత్యంత ధనికులలో వీళ్ళ కుటుంబం కూడా ఉంటుంది. వీళ్ళ మధ్య పరిచయం , స్నేహం , ప్రేమ ఎలా ఏర్పడింది అనే దానిపై ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ విషయానికి వస్తే, ఈయన నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. తొలిసినిమా ‘అల్లుడు శ్రీను ‘ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈ హీరో చేసే సినిమాలు పర్వాలేదు అనిపించేలా ఆడాయి. అలా వెళ్తున్న శ్రీనివాస్ కెరీర్ లో బోయపాటి శ్రీను తో చేసిన ‘జయ జానకి నాయక ‘ చిత్రం ల్యాండ్ మార్క్ గా నిల్చింది. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంత కాలం గ్యాప్ తీసుకొని ‘భైరవం ‘చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ఆ తర్వాత విడుదలైన ‘కిష్కిందపురి’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో కూడా మంచి జానర్ సినిమాలను ఎంచుకున్నాడు. ఇతని కెరీర్ ప్రస్తుతానికి మంచిగానే సాగిపోతుంది, పెళ్లి తర్వాత ఎలా ఉండబోతుందో చూడాలి.

 

Bellamkonda Sreenivas & Kavya Get Engaged -TV9
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version