Bandi Sanjay : అతడే ఒక సైన్యంలా నిలబడ్డాడు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటుతో చతికిలబడ్డ బీజేపీని ఒక్క ఊపుతో నిలబెట్టాడు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలు కట్టబెట్టాడు. యువతను ఆకర్షించాడు. నేతలను తనవైపునకు తిప్పాడు. పాదయాత్రతో ప్రజలకు చేరువ అయ్యాడు. తెలంగాణ బీజేపీకి ఒక కొత్త శక్తిని ఇచ్చాడు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత బండి సంజయ్ అంటే పడిచచ్చేలా ఎదిగాడు. అలాంటి బండి సంజయ్ ను కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర తప్పించారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు. అనూహ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు ఒకటే చర్చ. బండి సంజయ్ కు మద్దతుగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. బండికే తమ మద్దతు అని ఆ పోస్ట్ లోంచి తీసివేయవద్దంటూ అందరూ పోస్టులతో ఒక ఉద్యమమే చేస్తున్నారు. బండి సంజయ్ అనుకూల పోస్టులతో సోషల్ మీడియా మార్మోగుతోంది.
. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పలు విడతల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో పాదయాత్ర చేసి పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ పదవి సరిగ్గా ఎన్నికల సమయానికి ఎందుకు పోయింది? ఇది బండి సంజయ్ చేసుకున్న స్వయంకృతపరాధమా? లేక పార్టీ పెద్దలు ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసిందా? అన్న చర్చ జరుగుతోంది.
ఎన్ని విమర్శలున్నా, ఎన్ని వివాదాలొచ్చినా.. బండి సంజయ్ అధ్యాయం తెలంగాణ బీజేపీలో ఎప్పటికి మరిచిపోలేనిది. నిస్తేజంగా ఉన్న పార్టీకి ఒక ఊపును తీసుకొచ్చిన నాయకుడు బండి సంజయే. అది పాదయాత్ర అయినా, లేక పాత బస్తీ అయినా.. అధికార పార్టీ బీఆర్‌ఎస్Sతో సై అంటే సై అన్నట్టుగా సాగింది బండి ప్రయాణం. సంజయ్‌కి ఆది నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మద్దతు ఉంది. ఈ కారణంగా.. బండిని పదవులు వరించాయి. ఒకానొక దశలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్.. కట్టెలమ్మిన చోటే.. పూలమ్మాలన్నట్టుగా లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా నిలిచారు.
బక్కపలచని ఆహార్యం, పూర్తి మాస్ తరహాలో డైలాగ్‌లు కమలనాథుల్లో ఓ కొత్త జోష్ నింపేందుకు ఆరంభంలో బండి సంజయ్ బాగా ప్రయత్నించారు. ఒకానొక దశలో కేసీఆర్‌ను ఢీ కొట్టే నాయకుల్లో బండి సంజయ్ పేరు బలంగా నిలిచింది. కానీ చివరకు బీజేపీ రాజకీయాలకే ఆయన బలి అయ్యారు. సీనియర్లను కలుపుకోలేకపోవడంతో వారంతా ఫిర్యాదులతో పొమ్మనలేక పొగబెట్టారు. అతడు సాధించింది చూపకుండా లోపాలు ఎత్తి చూపి సాగనంపారు. దీంతో బండి సంజయ్ పై అభిమానం, ప్రేమతో యువత, కార్యకర్తలు నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో బండి సంజయ్ నే బీజేపీ చీఫ్ గా ఉంచాలంటూ హోరెత్తిస్తున్నారు.
Please don’t change Bandi Sanjay Anna 🙏🏻😞
పార్టీ పెద్దలకు నా యొక్క విన్నపం దయచేసి బండి సంజయ్ అన్న గారిని అధ్యక్ష పదవి నుండి మర్చాకండి…#BandiSanjay pic.twitter.com/HE1njXfnaM
— Neeraj Goud Gollapelli (@NeerajGoudBJP) July 3, 2023