Bro Movie Pre Release Function: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల అవ్వబోతుంది.
థమన్ అందించిన ట్యూన్స్ వినడానికి ఆడియన్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఈ రెండు సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడం లో థమన్ అందించిన సంగీతం పాత్ర చాలా పెద్దదే అని చెప్పొచ్చు. ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 22 వ తారీఖున చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇది వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మొత్తం హైదరాబాద్ లోనే జరిపేవారు. కానీ బ్రో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం రాజముండ్రి లో చెయ్యబోతున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయానికి పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ రాజకీయ పర్యటన లో బిజీ గా ఉంటాడు.
26 వ తారీఖు వరకు వరకు ఈ రెండవ విడత వారాహి యాత్ర జరగబోతున్నట్టు సమాచారం.మరి ఆ సమయం లో పవన్ కళ్యాణ్ ఏ ఊర్లో వారాహి యాత్ర చేస్తుంటాడో తెలియదు కాబట్టి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాకపోవచ్చు అని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. సముద్ర ఖని దర్శకత్వం లో ట్రెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.