PM Modi : మోడీ తెలంగాణకు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ చేతగాని తనానికి మాత్రమే వ్యతిరేకం

ఒక రాష్ట్రానికి సపోర్టు చేస్తే మరో రాష్ట్రం వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఆస్తులు పంచుకోవడానికి వీల్లేకుండా ఉంది. వీటిని ఏమంటారు. దీంతో రెండూ రాష్ట్రాలు హ్యాపీగా లేవు అని మోడీ అన్నారు.

Written By: NARESH, Updated On : September 19, 2023 6:49 pm

PM Modi : పార్లమెంట్ సాక్షిగా ఏపీ, తెలంగాణ విభజనను దారుణంగా చేశారని ప్రధాని మోడీ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై సహజంగానే మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. చీప్ ప్రాపగాండ చేశారు. మోడీ లోక్ సభలో మాట్లాడిన దాన్ని.. ట్విస్ట్ చేసి.. మోడీ ‘తెలంగాణ’కు వ్యతిరేకం అంటూ కేటీఆర్ విష ప్రచారం చేశారు.

మోడీ మాట్లాడుతూ.. ‘మేం మూడు రాష్ట్రాలను పంచామని.. జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్ ఘడ్ ఇచ్చాం. వాళ్లు ఎప్పుడూ కొట్టుకోలేదని.. వైరం లేదని.. ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని.. కాబట్టి ఎక్కడా సమస్యలు రాలేదు. కాంగ్రెస్ వల్లే ఇప్పుడు రెండు రాష్ట్రాలు హ్యాపీగా లేవని’ అని అన్నారు.

ఆంధ్రా ఎందుకు హ్యాపీ లేదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. విభజన చట్టంలో వారికి అన్యాయం జరిగిందన్నది అందరి వాదన.. మరి తెలంగాణ ఎందుకు హ్యాపీ లేదు అన్న మోడీ మాటను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు హ్యాపీగా లేదని చూస్తే.. ‘తెలంగాణ ఏర్పాటే నీటి కోసం.. నీళ్ల దోపిడీ మీద.. అది పంచకుండా విభజించడం వల్లనే ఇప్పుడు రాష్ట్రాలు కొట్టుకుచస్తున్నాయి.’ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించకుండా విభజించారు. దీంతో తెలంగాణ కూడా హ్యాపీగా లేదు.

విభజన అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. చట్టంలోనే పరిష్కరించాలి. రాష్ట్రాలు పరిష్కరించుకోవు. కేంద్రానికి ఇది చాత కావడం లేదు. ఒక రాష్ట్రానికి సపోర్టు చేస్తే మరో రాష్ట్రం వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఆస్తులు పంచుకోవడానికి వీల్లేకుండా ఉంది. వీటిని ఏమంటారు. దీంతో రెండూ రాష్ట్రాలు హ్యాపీగా లేవు అని మోడీ అన్నారు.

మోడీ తెలంగాణకు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ చేతగాని తనానికి మాత్రమే వ్యతిరేకం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.