Narendra Modi : ఈరోజు మోడీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనగర్ బచ్చీస్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతారు. మోడీ ఈ రెండు నెలల్లో 48 వేల కి.మీలు ప్రయాణం చేశారు. ఎన్నో మీటింగుల్లో పాల్గొన్నారు. కానీ ఈ మీటింగ్ ప్రత్యేకం. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ శ్రీనగర్ కశ్మీర్ వ్యాలీలో జరుగబోతోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటివరకూ మోడీ కశ్మీర్ లోయలో ప్రవేశించలేదు. అదీ శ్రీనగర్ లోని బచ్చీస్ స్టేడియం. ఉన్న వాటిల్లో అదే పెద్ద స్టేడియం.. దాదాపు 2 లక్షలమంది ప్రజలు వస్తున్నారు. దాని కోసం ఇంకో స్టేడియం తీసుకొని దానిలో లైవ్ ఇన్ పెడుతున్నారు.
ముఖ్యంగా యువకులు, మహిళల్లో అయితే చెప్పలేనంత ఉత్సాహం నెలకొంది. ఇంత సానుకూల వాతావరణం కశ్మీర్ లో ఎప్పుడూ లేదు. ఇప్పటివరకూ శ్రీనగర్ లో బక్చీస్ స్టేడియంలో ఇదే పెద్ద మీటింగ్.. ఆర్టికల్ 370 తర్వాత అక్కడ జరిగిన మార్పులకు ప్రతిబింబంగా జరుగుతున్న పెద్ద సభగా ఇది పేర్కొనవచ్చు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో మొదటి మోడీ సభపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.