Maha Shivaratri 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ఏటా మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు.
శిరాత్రి పండుగను శివభక్తులు ఘనంగా జరుపుకుంటారు. శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతాయి. వేకువ జామునే భక్తులు స్నానాలు చేసి శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది. ఈ ఏడాది శివరాత్రి ఏరోజు వచ్చింది.. శుభ ముహూర్తం ఎప్పుడు, పూజా విధానం ఏంటో తెలుసుకుందాం.
మార్చి 8న పండుగ..
ఈ ఏడాది మహాశిరాత్రి మార్చి 8న శుక్రవారం రోజు వచ్చింది. మార్చి 8వ తేదీ రాత్రి 9:57 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం మార్చి 9వ తేదీ సాయంత్రం 6:17 గంటలకు ముగుస్తుంది. మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు. జాగరణ ఎందుకు చేస్తారు, ఉపవాసం ఎందుకు ఆచరిస్తారు. తదితర వివరాలు కూడా తెలుసుకుందాం.
శుభ ముహూర్తం..
మహాశిరాత్రి రోజు ప్రదోషకాలంలో శివయ్యను పూజిస్తారు. ఉదయం తిథిని పాటించాల్సిన అవసరం లేదు. సాయంత్రం 6:26 నుంచి రాత్రి 9:28 గంటల వరకు మహాశివరాత్రి జరుపుకోవాలి. రాత్రి రెండో ప్రహార్ పూజా మార్చి 8న రాత్రి 9:28 గంటల నుంచి అర్ధరాత్రి 12:31 గంటల వరకు నిర్వహించాలి. మూడో ప్రహర్ పూజ అర్ధరాత్రి 12:31 నుంచి తెల్లవారుజామున 3:34 గంటల వరకు జరుపుకోవాలి. నాలుగో ప్రహార్ పూజ ఉదయం 3:34 గంటల నుంచి 6:37 వరకు ఉంటుంది. నిశితకాలం అర్ధరాత్రి 12:07 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 వరకు (మార్చి9న) నిర్వహించాలి.
పూజావిధానం.. .
– మహా శివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి. తర్వాత వివలింగానికి గంధం పూసి పంచామృతాభిషేకం చేయాలి.
– మహా శివరాత్రి రోజు ఉపవాస సమయంలో మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వ పత్రాలు, పువ్వులు, బియ్యం తదితరాలు ఉంచి శివునికి సమర్పించాలి.
– ఆలయానికి వెళ్లనివారు శివ లింగానికి పూజ చేయాలి.
– తర్వాత శివపురాణం పఠించాలి. అనంతరం మహామృత్యుంజ మంత్రం లేదా శివుని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి.
– మహా శివరాత్రి వేళ శివపూజ ముగిసిన తర్వాత నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి.
– శివరాత్రి రోజు తప్పకుండా జాగరణ(నిద్ర పోకుండా) చేయాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.
ఉపవాస దీక్షతో..
గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజుల ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజ చేయాలి. మంత్రాలు రానివారు సైతం భక్తిశ్రద్ధలతో శివలింగంపై చెబ్బు నీళుల పోసినా ఆ బోళాశంకరుని ఆశీస్సులు లబిస్తాయని పండితులు చెబతారు. రాత్రి జాగరణ ఉండడం వలన శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు. మోక్షం ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈ రోజు ఉపవాసం, జాగరణ ఉంటే ఏ తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదని పండితులు చెబుతారు.