PM Modi’s Development Politics : రాజకీయాలు ఎంత ఫాస్ట్ గా మారిపోతున్నాయంటే.. ఎన్నికలు నోటిఫికేషన్ ఇంకా రానే రాలేదు.. ఎంతో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. మోడీ సారథ్యంలో దేశంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. ఇదైతే నిజమని చెప్పొచ్చు.
ఎన్డీఏ ఫ్లాట్ ఫాం ఒక విశాల రాజకీయ వేదికగా మారుతోంది. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
త్రిపుర లో 75 శాతం ఆదివాసీలున్న ప్రాంతం ‘త్రిపుర మోత’ అనే మాణిక్యదేవ్ బర్మన్ అనే రాజ కుటుంబం వ్యక్తి బీజేపీకి పోటీగా ఆదివాసీల తరుఫున నిలబడ్డారు. తాజాగా ఆదివాసీల హక్కుల కోసం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మాణిక్యదేవ్ పార్టీ అతి త్వరలో బీజేపీ ప్రభుత్వంలో చేరబోతోంది. మాణిక్యదేవ్ బీజేపీ ప్రభుత్వంలో చేరికతో అక్కడ ప్రతిపక్షమే లేకుండా పోయింది.
బెంగాలీ, ఆదివాసీలు అంతా కలిసి ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నారు. ఇదే రాజకీయ పునరేకీకరణ అని చెప్పొచ్చు. అభివృద్ధి మంత్రంగా దీన్ని చెప్పొచ్చు.
ఒడిశాలో అధికార బిజు జనతాదల్ కు పోటీ బీజేపీనే.. అయినా వీళ్లు సపరేట్ గా పోటీ చేయకుండా కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఎక్కువ పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చేటట్టు.. ఎక్కువ అసెంబ్లీ స్తానాలు బీజేడీకి ఇచ్చినట్టు ఒప్పందం కుదిరింది. ఈ క్యాండిడేట్లు అందరూ గెలవబోతున్నారు. ఇది రాజకీయాల్లో అతిపెద్ద రెండో పరిణామం..
మూడోది.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తిరిగి ఎన్డీఏ గూటికి చేరేటట్టు కనిపిస్తున్నారు. 2018 వరకూ చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు. ఇప్పుడు ఆయన చేరబోతున్నారు. ఇక ఎవరూ మిగలడం లేదు. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) ఎన్డీఏలో చేరింది. బీహార్ సీఎం నితీష్ సైతం ఎన్డీఏలోకి వచ్చాడు. యూపీలో ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏ గూటికి వచ్చింది.
మోడీ సారథ్యంలో దేశంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది అనడానికి ఇదే ఉదాహరణ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు