PM Modi : లోక్ సభలో కన్నా రాజ్యసభలో మోడీ ప్రసంగం అత్యంత ఆకట్టుకుంది. కాంగ్రెస్ ను ఉతికి ఆరేశాడు. రెండు మూడు టాపిక్స్ తోనే ఏ విధంగా కాంగ్రెస్ హిపోక్రసో చెప్పకనే చెప్పాడు. అందులో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి..
సాంఘిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అని చెప్పారు. నెహ్రూ గతంలో ముఖ్యమంత్రులకు రాసిన లేఖలను ఇందులో మోడీ కోట్ చేశారు. రిజర్వేషన్లు మంచివి కావన్న నెహ్రూ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై ‘ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఉండాలని’ కోరుతున్న దానిపై మోడీ కౌంటర్లు ఇచ్చారు. వాళ్ల ముత్తాత ఏం మాట్లాడాడో మోడీ ఎండగట్టారు. ఆచరణలో అణగారిన వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేయలేదన్నది మోడీ చెప్పిన ప్రసంగ సారాంశం..
కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఎండగట్టిన మోడీ పార్లమెంట్ ప్రసంగంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.