https://oktelugu.com/

Suriya and Trivikram Srinivas: త్రివిక్రమ్ సూర్య కాంబోలో సినిమా…రాజుల కాలం నాటి కథతో వస్తున్న గురూజీ…

త్రివిక్రమ్ ని అందరూ రొటీన్ స్టోరీలు చేస్తున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. కాబట్టి తను కూడా ఒక వెరైటీ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే సూర్యని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 8, 2024 / 12:25 PM IST
    Follow us on

    Suriya and Trivikram Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ తనదైన రీతిలో సినిమాలు చేసి సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అంటూ కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే అప్పుడెప్పుడో సూర్యతో త్రివిక్రమ్ సినిమాని చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక అదే సినిమాని ఇప్పుడు చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    దీనికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ బిజీగా ఉండడంతో తమిళ్ నటుడు అయిన సూర్య ని హీరోగా పెట్టుకుని సెవెంత్ సెన్స్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అలాగే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని కలిగి ఉన్న కథను చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 18 వ శతాబ్దం కాలం లో జరిగే స్టొరీ కి ఈ జనరేషన్ లో జరిగే స్టోరీ కి మధ్య రిలేటెడ్ గా ఈ సినిమా నడవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    అయితే త్రివిక్రమ్ ని అందరూ రొటీన్ స్టోరీలు చేస్తున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. కాబట్టి తను కూడా ఒక వెరైటీ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే సూర్యని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సూర్య కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతానికి సూర్య కంగువ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత ఈ సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కితే త్రివిక్రమ్ కూడా వెరైటీ సినిమాలని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో వీళ్ల ఇద్దరి నుంచి ఎలాంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా ఉండబోతుంది అంటు ఇప్పటికే కోలీవుడ్ మీడియా కొడైకొస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అయ్యే విధంగానే కనిపిస్తుంది..