కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల సంక్షేమం కొరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రైతుల ఖాతాలలో ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేస్తోంది. రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ఈ డబ్బులు ఉపయోగపడతాయి. గత రెండు సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అమలవుతుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఈ స్కీమ్ అమలు కాలేదు.
Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..?
పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఈ స్కీమ్ ను ఆ రాష్ట్రంలో గతంలో అమలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు మాత్రం మమతా బెనర్జీ ఈ స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో రైతుల ఖాతాలలో దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ కు సంబంధించిన 8వ విడత నగదు కూడా జమ కానుంది. మమతా బెనర్జీ ఈ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అమిత్ షా మాత్రం ఈ స్కీమ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ ఏడాది రాబోయే కొత్త ఫీచర్లివే..?
కేంద్ర మంత్రి అమిత్ షా రైతుల ఖాతాలలో త్వరలో నగదును జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగదును జమ చేస్తామని అమిత్ షా అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల డబ్బులు 12 వేల రూపాయలు, ఈ ఏడాదికి సంబంధించిన ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తామని అమిత్ షా ప్రకటించారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఒకేసారి రూ.18,000 జమైతే మాత్రం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మమతా సర్కార్ ఇప్పుడు స్కీమ్ ను అమలు చేస్తామని చెప్పినా కేంద్రం మాత్రం ఈ స్కీమ్ ను బీజేపీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పడం గమనార్హం.