ఉద్యమానికి ముందు మనది ధనికరాష్ట్రం అంటూ కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. అందరికన్నా.. మనమే మంచిగ బతుకుతం అన్న మాటలు అందరికీ గుర్తున్నాయి ఇప్పుడు.. తెలంగాణ వచ్చి ఏడేళ్లు దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ చేసిన అభివృద్ధి శూన్యం.. ప్రాజెక్టులు తప్పా.. రాష్ట్రంలో మరో పథకమే పూర్తయిన దాఖాలాలు లేవు. ఉన్నదంతా గోదావరిలో గుమ్మరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ లోటును పూడ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపేందుకు సిద్ధం అవుతున్నారు.
Also Read: బ్రేకింగ్: ఏపీలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు రానురాను ఆర్థిక నిర్వహణ కత్తిమీద సములా మారుతోంది. సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం.. వడ్డీలు చెల్లించడం.. ప్రాజెక్టులకు నిధులు, అప్పులు తేవడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ లో అప్పుల మీదకన్నా ఆదాయం పెంచుకోవడం పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పన్నులు బాదేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకుంది. భూముల విలువ బాగా పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్లు కూడా గణనీయంగా పెరిగాయి. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి భూముల రిజిస్ర్టేషన్ల విలువల్లో మార్పులు చేయలేదు. కొత్తగా తీసుకొచ్చిన ధరణి చట్టం ప్రకారం.. పెంచుదామని అనుకున్నారు.. కానీ.. ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు బడ్జెట్ లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆశిస్తున్నారు.
Also Read: ఊపులేని ఉక్కు ఉద్యమం..?
అలాగే.. మద్యంపై పన్నులు పెంచడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే.. మద్యం రేటు తెలంగాణలో చాలా తక్కువ. ఒక్క పదిశాతం మేర పెంచినా.. పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. పైగా.. ఏపీ నుంచి కూడా కొనుగోళ్లు పెరిగాయి. సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఆదాయాన్ని మద్యం రేట్లు పెంచడం ద్వారా తెలంగాణ సర్కారు ఆశిస్తోంది. ఇదే సమయంలో భూముల అమ్మకం అనేది కూడా సీరియస్ చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.
గత ఏడాది బడ్జెట్ లో అంచనావేసినా.. అమ్మలేక పోయారు. ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి రానీయకూడదని.. ఈ ఏడాది భూములను అమ్మి కనీసం రూ.20వేల కోట్ల వరకు సమీకరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఇరవైశాతం వరకు వడ్డీలు కట్టేందుకే పోతోంది. అందుకే ఇకనుంచి అప్పులపై మరీ ఆధారపడకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్