https://oktelugu.com/

బ్రేకింగ్: ఏపీలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

ఏపీలో పంచాయతీ ఎన్నికల ముగియకముందే మున్సి‘పోరు’ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వరుస ఎన్నికలకు సై అన్నారు. Also Read: ఆ పార్టీల మతమంత్రానికి గట్టిషాక్.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల షఎడ్యూల్ విడుదలైంది. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. 14వ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 15, 2021 / 11:37 AM IST
    Follow us on

    ఏపీలో పంచాయతీ ఎన్నికల ముగియకముందే మున్సి‘పోరు’ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వరుస ఎన్నికలకు సై అన్నారు.

    Also Read: ఆ పార్టీల మతమంత్రానికి గట్టిషాక్..

    తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల షఎడ్యూల్ విడుదలైంది. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.

    ట్విస్ట్ ఏంటంటే గతంలో అర్థాంతరంగా నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి. 12 నగరపాలిక సంస్థల్లో డివిజన్లు, వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పుర, నగరపాలికల్లో 12086 మంది నామినేషన్లు వేశారు.ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

    Also Read: ఊపులేని ఉక్కు ఉద్యమం..?

    ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్