https://oktelugu.com/

మార్కెట్ లోకి కొత్తరకం ఆటోలు.. డీజిల్ తో అవసరం లేకుండా..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్ ధర పలు రాష్ట్రాల్లో 100 రూపాయలకు చేరగా లీటర్ డీజిల్ ధర 90 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ప్రముఖ త్రీ వీలర్ తయారీ కంపెనీలలో ఒకటైన పియాజియో డీజిల్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేసింది. ఎఫ్ఎక్స్ శ్రేణి కింద మార్కెట్ లో లాంచ్ చేసిన ఈ ఆటోలను కొనుగోలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 24, 2021 / 11:06 AM IST
    Follow us on

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్ ధర పలు రాష్ట్రాల్లో 100 రూపాయలకు చేరగా లీటర్ డీజిల్ ధర 90 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ప్రముఖ త్రీ వీలర్ తయారీ కంపెనీలలో ఒకటైన పియాజియో డీజిల్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేసింది. ఎఫ్ఎక్స్ శ్రేణి కింద మార్కెట్ లో లాంచ్ చేసిన ఈ ఆటోలను కొనుగోలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: హీరో వాహనాలపై బంపర్ ఆఫర్.. పెట్రోల్ కష్టాలకు చెక్..?

    తక్కువ ధరకే కంపెనీ ఈ ఆటోలను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ప్యాసింజర్, కార్గో ఆప్షన్లలో ఈ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలో పియాజియో అప్పి ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్‌లో 9.5 కిలోవాట్ పవర్‌ట్రైన్ ఉంటుంది. ఫుల్లీ మెటల్ బాడీ ఉండటం ఈ ఆటో ప్రత్యేకత కావడం గమనార్హం. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయెల్ టోన్ సీట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డ్యూయెల్ టోన్ సీట్స్ లాంటి ఫీచర్లు ఈ ఆటోలో ఉన్నాయని తెలుస్తోంది.

    Also Read: ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా రూ.10 వేలు పొందే ఛాన్స్..?

    రీజనరేటివ్ బ్రేకింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బూస్ట్ మోడ్ లాంటి ఫీచర్లు కూడా ఈ ఆటోలో ఉన్నాయి. కొత్త ఆటోను కొనుగోలు చేయడం ద్వారా మూడు సంవత్సరాల వారంటీతో పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా లభించనుంది. పియాజియో ఐకనెక్ట్ యాప్ సహాయంతో వెహికిల్ డేటాను ట్రాకింగ్ చేయవచ్చు. ఎక్స్‌ట్రా ఎఫ్ఎక్స్ అనే కార్గో వెర్షన్ ధర రూ.3.12 లక్షలుగా ఉండగా ఈసిటీ ఎఫ్ఎక్స్ అనే ప్యాసింజర్ వెహికల్ ధర రూ.2.83 లక్షలుగా ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    1800 120 7520 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయడం ద్వారా కొత్త ఆటోలను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు సులభంగా చేసుకోవచ్చు. పియాజియో వెహికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డియాగో గ్రాఫీ ఎఫ్ఎక్స్ శ్రేణి వెహికల్స్‌ను ఇండియన్ ఎలక్ట్రిక్ రెవల్యూషన్‌ లో భాగంగా ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు