Homeఆంధ్రప్రదేశ్‌బ్యాలన్స్‌ తప్పుతున్న బాబు

బ్యాలన్స్‌ తప్పుతున్న బాబు

Chandrababu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు టైమ్‌ దొరికినప్పుడల్లా దేశంలోనే తానే సీనియర్‌‌ లీడర్‌‌ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏమైనా అంటే చాలు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని అంటుంటారు. తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆ పార్టీ అధినేత చంద్రబాబుది కూడా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. అటు ఉమ్మడి ఏపీని.. విడిపోయాక కూడా ఓ దఫా ముఖ్యమంత్రిగా సాగారు. అయితే.. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా పార్టీ అధినేత వణికిపోతున్నారట. బ్యాలన్స్ తప్పుతున్నారని టాక్‌. ఏం మాట్లాడుతున్నారో ఆయనది ఆయనకే అంతుబట్టడం లేదు. చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వాళ్లెవరైనా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

Also Read: జనసేన సత్తా: ఏపీ ‘పంచాయతీ’లో 27శాతం ఓట్లతో గెలుపు

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2004 నుంచి 2014 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఏనాడూ భయపడలేదు. ఇలా వ్యవహరించలేదు. చంద్రబాబు రాజకీయాల్లో హూందాగా వ్యవహరించేవారని పేరుంది. ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన రాష్ట్రానికి సీఈవో అవుతారు. ప్రతిపక్షనేతగా ఉంటే సద్విమర్శలు చేస్తూ అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఇలా నోరు జారలేదు. కానీ.. ఎందుకో 20 నెలలుగా చంద్రబాబు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని ఏ1గా సంభోదించడమే కాకుండా నేరగాళ్లని మాట్లాడుతున్నారు.

వైఎస్ షర్మిల విషయంలో కూడా చంద్రబాబు లైన్ దాటి మాట్లాడారు. జగన్ వెన్నుపోటు పొడిచారంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకే వెనక తగిలాయి. రాయలసీమ, తెలంగాణలలో కుటుంబ బాంధవ్యాలు ఎక్కువ. ఉమ్మడి కుటుంబాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. షర్మిల పార్టీ పెట్టడం వెనక వేరే ఉద్దేశాలు ఏమైనప్పటికీ అన్నా, చెల్లెళ్లు దూరమయ్యేంత లేదన్నది పార్టీ నేతలు చెబుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తన వెన్నుపోటును జగన్ వైపు మలర్చడానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ చంద్రబాబు రోజూ కేకలు పెడుతున్నా ఆయన చేసిందేమిటన్న ప్రశ్న తిరిగి ఆయనకే తగులుతుంది.

Also Read: ఏబీఎన్ డిబేట్ లో బీజేపీ నేత విష్ణుపై చెప్పుతో దాడి

ఇక పంచాయతీ ఎన్నికలు తనకు అనుకూలంగా ఉంటాయని చంద్రబాబు భావించారు. పెద్దగా గెలవకపోయినా పార్టీ నేతలు ఏకతాటిపైకి వస్తారని ఆశించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చంద్రబాబుకు ఆశ్చర్యం కలిగించాయి. అనేక చోట్ల సొంత పార్టీ నేతలు వైసీపీ వారితో కుమ్మక్కయ్యారు. సొంత జిల్లా చిత్తూరులోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అంతా అధికార పార్టీ భయపెట్టి గెలుచుకుందని ఇప్పుడు చెబుతున్నా, చంద్రబాబుకు మాత్రం పార్టీ తన హ్యాండ్‌లో లేదన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే.. ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఎందుకో బ్యాలన్స్‌ తప్పుతున్నట్లే కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version