ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 230 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి నెల 10వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 257 ఉద్యోగాలు..?
https://www.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ ఇంజనీర్ – 200 (ఎలక్రికల్-90, మెకానికల్-70, ఎలక్ట్రానిక్స్ /ఇన్స్‌స్ట్రుమెంటేషన్-40) ఉద్యోగ ఖాళీలు ఉండగా అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. 60 శాతం మార్కులు సాధించిన ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్ట్స్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: సీఐఎస్‌ఎఫ్ శుభవార్త.. భారీ వేతనంతో 2,000 ఉద్యోగాలు..?
అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా https://www.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభించనుంది.