Petrol Diesel Price:పెట్రోల్ , గ్యాస్ పెరిగితే మనకేంటి నొప్పి అని కొందరు అనుకుంటారు. కానీ వాటితోనే సమస్త ధరలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే రవాణా చేసే లారీలు, ఇతర వాహనాలన్నీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ తోనే నడుస్తాయి. వాటి ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు పెంచేస్తారు. అలా పెట్రో, డీజిల్ వల్ల సమస్త ధరలు పెరుగుతాయన్న మాట..

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో మోడీ సర్కార్ కొరఢా ఝలిపించింది. పెట్రో, గ్యాస్ ధరలు అమాంతం పెంచేసింది. ఎన్నికల కోసం ఆగిన మోడీ సార్ ఇప్పుడు దేశ ప్రజలకు కర్రుకాల్చి వాత పెట్టారు. ఇక ఆ సెగకు ప్రజలంతా కుయ్యో మొర్రో అంటున్న పరిస్థితి నెలకొంది.
Also Read: KCR: బిగ్ బ్రేకింగ్: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన కేసీఆర్
సుమారు ఐదు నెలల తర్వాత మళ్లీ పెట్రో బాంబు పేలింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ధరలు పెరుగుతాయని అందరూ ఆశించారు. ఈమేరకు మీడియా సంస్థలు, ప్రతిపక్షాలు కూడా విస్తృతంగా ప్రచారం చేశాయి. కానీ కేంద్రం యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసి అధికారం చేపట్టడంతో పెట్రో ధరలు మంగళవారం పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ ధర కూడా భారీగా పెంచింది. రెండు రోజుల క్రితమే బల్క్ డీజిల్‌పై రూ.20 పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా రీటెయిల్ ఇంధన ధరలు కూడా పెంచాయి.
-సిలిండర్‌పై రూ.50 పెంపు..
గ్యాస్ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1002కు చేరింది. అటు దేశంలో ఇంధన ధరలు సైతం పెరిగాయి.
-పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇవీ..!
దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందించాయి. మంగళవారం ఉదయం నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 150 డాలర్లకు చేరాయి. 10 ఏళ్ల గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video:
[…] Also Read: Petrol Diesel Price: మోడీ సార్ బాదుడు మొదలెట్టాడు.… […]
[…] […]
[…] Attack On Kurnool Janasena Party Office: ఏపీలో రోజు రోజుకూ ప్రతీకార రాజకీయాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జనసేన అధిఏత పవన్ విషయంలో వైసీపీ ఎలాంటి ప్రతికారానికి పాల్పడుతుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల రిలీజ్ విషయంలో రేట్లు తగ్గించి ఎంత టార్గెట్ చేసిందో చూశాం. ఇక ఆయన మూవీ భీమ్లానాయక్ అయిపోయాకే కొత్త జీవోను తెచ్చారు. ఇదిలా ఉండగా.. మొన్న ఆవిర్భావ సభ విషయంలో కూడా ఇలాగే జరిగింది. […]