House Warming With Wife Wax Statue:: ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరిక కోసం మరొకరు ఆ జన్మాంతం కలిసి మెలిసి బతకడమే దాంపత్య జీవితం పరమార్థం. అయితే భార్య లేదా భర్త సడెన్ గా తమ జీవితంలోకి వెళ్లిపోతే మాత్రం.. ఆ జీవితం నరకమనే చెప్పుకోవాలి. కాగా తమ మధ్య జీవిత భాగస్వామి లేని లోటు ఉండొద్దని ఈ మధ్య చాలామంది వారి జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేస్తున్నారు.

కాగా ఇప్పుడు కర్ణాటకలోని కొప్పాల్ ప్రాంతంలో నివసించే శ్రీనివాస్ గుప్తా కూడా తన భార్య జ్ఞాపకార్థం చేసిన పని అందరి మనసులను కదిలిస్తోంది. తన భార్య వెంకట నాగమాధవి అంటే అతనికి ఎంతో ఇష్టం. భర్త శ్రీనివాస్‌ను భార్య ఎంతో ప్రేమగా చూసుకునేది. వాస్తవానికి శ్రీనివాస్‌కు నాగమాధవితో పెండ్లి అయిన తర్వాత పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఏ బిజినెస్ చేసినా కోట్లలో లాభాలు వచ్చాయి.
Also Read: ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు
కాగా వారి అన్యోన్యతను చూసి కాలానికి కన్నుకుట్టినట్టుంది. నాగమాధవి మరణించింది. 2017లో కుటంబం అంతా కలిసి తిరుపతికి దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో అందరూ కలిసి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నాగమాధవి మృతి చెందింది. కాగా భార్య మరణాన్ని శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు.

తన ఇంట్లో భార్య కనిపించకపోయే సరికి ఆ లోటు అతన్ని వెంటాడసాగింది. భార్య చనిపోయే సమయంలో తమ కలల ఇంటిని ప్రారంభించారు. అది పూర్తి కావస్తున్న సమయంలోనే భార్య చనిపోవడం అతన్ని మరింత బాధించింది. అయితే గృహ ప్రవేశానికి సమయం దగ్గరపడుతుండటంతో.. భార్య కూడా తనతో పాటే కొత్త ఇంట్లో ఉండాలని ఆమె మైనపు బొమ్మను తయారు చేయించాడు శ్రీనివాస్. అచ్చం జీవం ఉట్టి పడే విధంగా ఆర్టిస్టు శ్రీధర్ నాగమాధవి బొమ్మను తయారు చేశాడు. కాగా భార్య మైనపు బొమ్మతో శ్రీనివాస్ గృహ ప్రవేశం చేశాడు. కాగా ఈ వార్త ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.
Also Read: మళ్ళీ తండ్రి కాబోతున్న దిల్ రాజు
Recommended Video: