Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా అంటేనే సంగీత ప్రపంచంలో తిరుగులేని మేటి. ఎందుకంటే.. ఆయన సంగీతంలో ఒక ఉత్తేజం ఉంటుంది. ఆయన స్వరంలో ఒక ‘ఉత్సాహాం ఉంటుంది. అన్నిటికి మించి ఇళయరాజా ఎప్పుడు సీరియస్ గా ఉంటారు. ఆయన మధురమైన ప్రేమ పాటలను సృష్టిస్తాడు గానీ, ఆయన జీవితంలో ప్రేమ లేదు అని ఇన్నాళ్లు ఒక ప్రచారం జరిగింది.

అయితే, ఇళయరాజా మాట్లాడుతూ.. తానూ ప్రేమించానని, అయితే అది పలు విధాలుగా ఉంటుందన్నారు. అయితే, ఆయన అభిమానులు మాత్రం ఇళయరాజా గొప్ప ప్రేమికుడు అని అందుకే.. ఆయన గొప్ప ప్రేమ పాటలను అందించారు అని చెబుతున్నారు. ఇక చెన్నైలో సొంతంగా ఒక రికార్డింగ్ స్టూడియో కట్టుకోవాలని ఇళయరాజా చిరకాల కోరిక అట.
Also Read: Virata Parvam Movie: ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’
మొత్తానికి ఇటీవల తన కోరికను ఆయన తీర్చుకున్నారు. ఇక ఇళయరాజా స్టూడియోని చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే వచ్చి వెళ్లారు. ఇక ఇళయరాజా సొంతంగా నందంబాక్కంలోని కామ దార్ నగర్ రోడ్ లో స్టూడియో కట్టుకోవడానికి వేరే కారణం ఉందట. ఇళయరాజా చాలా కాలం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలోనే తన పాటల రికార్డింగ్ జరిపేవారు.

కాకపోతే ఇటీవల ప్రసాద్ స్టూడియో యాజమాన్యంతో ఇళయరాజాకు గొడవ అయింది. ఆ గొడవ తర్వాత ప్రసాద్ యాజమాన్యం, రాజాని అక్కడ నుండి వెకేట్ చేయించారు. దాంతో ఆయన అది అవమానంగా భావించి, వారికీ పోటీగా ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టాలని కసితో ఈ స్టూడియో కట్టారని అంటుంటారు.
Also Read: Kotha Bangaru Lokam: ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు
Recommended Video:
[…] Star Hero: పాతికేళ్ల క్రితం, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఏకైక హీరో అబ్బాస్. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమా తర్వాత అబ్బాస్ రేంజ్ రెట్టింపు అయ్యింది. ప్రేమికుడిగా.. ప్రియురాలి ప్రేమ కోసం పరితపించే పాత్రలో అబ్బాస్ నటన అద్భుతం అనిపించింది. మెయిన్ గా అబ్బాస్ లుక్ అదుర్స్ అనిపించింది. అప్పట్లో యువతుల గుండెల్లో ఈ హ్యాండ్సమ్ హీరో గుబులు రేపాడు. కానీ, ఆ తర్వాత చాలా వేగంగా కనుమరుగైపోయాడు అబ్బాస్. […]
[…] Music Director Chakravarthy Biography: అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి అంటే.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆయన అంత గొప్పగా పాటలను అందించాడు. ఆయన పాటల్లో మధురమైన సంగీతం ఉంటుంది. కాగా చక్రవర్తి అసలు పేరు ‘కొమ్మినేని అప్పారావు’. […]
[…] SS Rajamouli: ప్రస్తుతం రాజమౌళి అంటే కేవలం తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా భయంకరమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయి. సాధారణంగా హీరో లను బట్టి సినిమాలు చూసేవారు ఉంటారు. కానీ జక్కన్న విషయంలో మాత్రం అంతా రివర్స్. అక్కడ హీరోలు ఎవరు అనేదాని కంటే కూడా.. రాజమౌళి కోసమే థియేటర్లకు క్యూ కట్టే వారు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. తెలుగులో దీనికి ఇంత క్రేజ్ రావడానికి రామ్ చరణ్, తారక్ కూడా ఒక కారణమే. […]