https://oktelugu.com/

Annamalai : ఎక్కడ చూసినా అన్నామలై జపం చేస్తున్న తమిళ సమాజం

అందుకే పెరియార్ విగ్రహాలను తొలగిస్తామని... హిందువుల మనోభావాలను కాపాడుతామని అన్నామలై సంచలన ప్రకటన చేశారు. అన్నామలై ప్రకటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2023 / 02:27 PM IST

    Annamalai : శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఎందుకంటే దీన్ని వైష్ణవ భక్తులు భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఎందుకు ఇదిప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందంటే.. అన్నామలై 100 నియోజకవర్గ పాదయాత్ర సభ ఈ శ్రీరంగం దేవాలయం ముందు నిర్వహించారు.

    తమిళనాడులో శ్రీరంగం ఆలయం అంటేనే ఒక విశిష్టత ఉంది. చరిత్ర ఎంతో ఉంది. అందుకే ఈ ఆలయం ముందర బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు సభ పెట్టి ప్రారంభించారు. దీనికి ఫైర్ క్రాకర్స్ పేల్చుదామని తీసుకొచ్చిన బీజేపీ శ్రేణుల వద్ద నుంచి వాటిని లాక్కొని పోలీసులు తీసుకెళ్లిపోవడం ఉద్రిక్తతను పెంచింది. అన్నామలై సభకు జనం తండోపతండాలుగా వచ్చారు. జనంలో స్పందన విపరీతంగా ఉంది.

    శ్రీరంగం ఆలయంలో జరిగిన సమావేశంలో అన్నామలై ఓ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాల ముందు ఉన్న పెరియార్ విగ్రహాలను తీసివేసి సాధువులు, తిరువల్వూర్, స్వాముల విగ్రహాలు ప్రతిష్టిస్తాం.. భక్తుల సెంటిమెంట్లను దెబ్బతీసే బోర్డులు, ఫ్లాగ్ పోల్స్ అన్నీ తొలగిస్తామని అన్నామలై సంచలన ప్రకటన చేశారు.

    అన్నామలై ఎప్పుడూ ఇలా హిందుత్వం మీద మాట్లాడడు. ఇలా సంచలన ప్రకటన ఇవ్వడం ఈ రీలిజీయ్స్ ను ఆకట్టుకున్నాయి. హిందువులను ఆకట్టుకుంది. ఈ పెరియార్ విగ్రహాల మీద ‘దేవుడు లేడు.. దేవుడిని నమ్మవద్దు.. దేవుడిని నమ్మేవాళ్లు మూర్ఖులు’ అని ఉంటాయి. అందుకే పెరియార్ విగ్రహాలను తొలగిస్తామని… హిందువుల మనోభావాలను కాపాడుతామని అన్నామలై సంచలన ప్రకటన చేశారు.

    అన్నామలై ప్రకటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడచ్చు.