PM Modi : నవంబర్ 11న తిరిగి మోడీ హైదరాబాద్ వస్తున్నారు. 7న బీసీ సభకు ఎల్బీ స్టేడియానికి వచ్చిన మోడీ.. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ లో అంతకుమించిన సమావేశంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియం సమావేశం అది ఎన్నికల సభ.. సికింద్రాబాద్ లో జరిగేది బీజేపీ సభ కాదు..
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఉప కులాల విశ్వరూప సమావేశం.. దీనికి మోడీ రావడమే అనూహ్యం. ఇది ఎన్నికల సమావేశం కాదు. ఇది బీజేపీ సమావేశం కాదు.. మాదిగల హక్కుల కోసం జరుపుతున్న ఈ సభకు ఏపీ , దక్షిణాది, ఉత్తర భారత నుంచి పలువురు దళిత దిగ్గజాలు వస్తున్నారు.
అసలు ఈ సభ ప్రాముఖ్యత ఏంటి? మోడీ లాంటి బలమైన నేత ఎందుకొస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ కోసం జరుపుతున్న ఈ సభలో మోడీ ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నాడు? 11న జరిగే సభలో మోడీ సందేశంతో తెలంగాణ ఎన్నికల్లో పెద్ద మార్పు? ఖాయమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.