https://oktelugu.com/

గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా పొందే అవకాశం.. ఎలా అంటే..?

దేశంలోని కోట్ల సంఖ్యలో కుటుంబాలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నాయి. అయితే రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 700 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. దాదాపు గ్యాస్ సిలిండర్ ధరకు సమానంగా క్యాష్ బ్యాక్ లభిస్తూ ఉండటంతో ఉచితంగానే గ్యాస్ సిలిండర్ లభిస్తున్నట్టు భావించవచ్చు. అయితే ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 31, 2021 / 01:36 PM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో కుటుంబాలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నాయి. అయితే రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 700 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. దాదాపు గ్యాస్ సిలిండర్ ధరకు సమానంగా క్యాష్ బ్యాక్ లభిస్తూ ఉండటంతో ఉచితంగానే గ్యాస్ సిలిండర్ లభిస్తున్నట్టు భావించవచ్చు.

    అయితే ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఇప్పటివరకు పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేయని వాళ్లు ఈ ఆఫర్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకొని క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పేటీఎం యాప్ యూజర్లు బుకింగ్ అమౌంట్ విలువ 500 కంటే ఎక్కువగా ఉంటే సిలిండర్ ను బుకింగ్ చేసిన తరువాత ఒక కూపన్ ను పొందవచ్చు.

    ఆ కూపన్ ద్వారా క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను కలిగి ఉన్నవాళ్లకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసే సమయంలో ఫస్ట్ ఎల్పీజీ అని ఇంగ్లీష్ లో ప్రోమో కోడ్ ను ఎంటర్ చేస్తే మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ కు అర్హత పొందవచ్చు. పేటీఎం యూజర్లు రీచార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్ ఆప్షన్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేయవచ్చు.

    రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండగా క్యాష్ బ్యాక్ ఆఫర్ల వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతోంది. ఇప్పటివరకు పేటీఎం యాప్ ను వినియోగించని వారు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్ లోడ్ చేసి గ్యాస్ సిలిండర్ ను క్యాష్ బ్యాక్ ద్వారా తక్కువ ధరకే పొందవచ్చు.