
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజు. ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడంటే ఏదో ఒక రికార్డు ఆయనకు మోకారిల్లాల్సిందే. తాజాగా ఆయన మరో రెండు రికార్డులపై కన్నేశాడు. తన బ్యాటింగ్, కెప్టెన్సీలతో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన అతడు తాజాగా మరో రెండు రికార్డులు ఆయనకు చేరువయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ కెప్టెన్‌గా ఈ ఘనతలు సాధించే అవకాశం ఉంది.
కోహ్లీ అంతకుముందే టీమిండియా తరఫున అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. దిగ్గజ సారథులు సౌరబ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ కన్నా ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. అయితే.. స్వదేశంలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ప్రస్తుతం ధోనీ ఉన్నాడు. అతని సారథ్యంలో టీమిండియా భారత్‌లో 21 విజయాలు సాధించగా.. కోహ్లీ నేతృత్వంలో 20 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీ మరో రెండు విజయాలు సాధిస్తే ధోని రికార్డును అధిగమించవచ్చు.
ఇదిలా ఉండగా.. టెస్టు కెప్టెన్‌గా విరాట్ ఇప్పటికే 5,220 రన్స్ చేశాడు. రాబోయే సిరీస్‌లో మరో 14 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన నాలుగో కెప్టెన్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్లైవ్‌లాయిడ్ (5,223)ను అధిగమించే అవకాశం ఉంది. వీరికన్నా ముందు గ్రేమ్‌స్మిత్ (8,659), అలెన్ బోర్డర్ (6,623), రికీ పాంటింగ్ (6,542) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.