Pawan Kalyan Varahi Yatra : వారాహి యాత్ర మూడో విడత ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈసారి ఫోకస్ విశాఖ జిల్లాపైన ఉంది. గత రెండు విడుతల కన్నా.. మూడో విడత మీద అంచనాలు పెరిగాయి. పవన్ మీదే అందరి ఫోకస్ నెలకొంది. ఒకటి ఢిల్లీలో పవన్ కు పెరిగిన ప్రాముఖ్యత. మోడీ పక్కనే నిల్చోపెట్టుకొని ఫొటో.. బ్రో సినిమా విడుదల.. ఆ తర్వాత జనసేన లో కీలక మార్పు జరిగింది. జనసేన ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాలపై ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా జనాలకు ఇంకా గురి కుదిరింది. ఫోకస్ పెరిగిన నేపథ్యంలో మూడో విడత యాత్రపై అందరి అంచనాలు నెలకొన్నాయి.
గత రెండు వారాహి యాత్రల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. యాత్ర మొదలుపెట్టినప్పుడు లేని పాపులారిటీ ముగిసే వరకూ భారీగా వచ్చేసింది. క్షేత్రస్థాయిలో గణనీయమైన మార్పు వచ్చింది. పవన్ తిరిగిన ప్రదేశాల్లో ఓపినియన్ పోల్ తీసేటట్టు అయితే.. టీడీపీ, వైసీపీ, జనసేనల్లో నంబర్ 1 పార్టీగా జనసేన నిలువబోతోంది.
పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.