Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గారు, ఇలాగైతే ఎలా?

తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 5, 2023 2:36 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మారాలి. ఇలాగైతే కష్టమే.. పవన్ అభిమానులకు కోపం వచ్చినా ఇది చెప్పాల్సిన నిజం. దాదాపు ముందు నుంచి తెలంగాణలో పవన్ పోటీచేయడాన్ని బ్లండర్ మిస్టేక్ గా అభివర్ణించాం. ఓకే తెలుగు వ్యూ పాయింట్ లోనూ వివరించాను. ఎందుకు పవన్ పై ఎన్నికల వేళ వీడియోలు చేయలేదంటే.. తెలంగాణలో జనసేన పోటీచేయడం మంచిది కాదన్నది నా అభిప్రాయం. గట్టిగా విశ్వసించి మరీ చెప్పాను. జరుగుతుంది వేరు కాబట్టి విమర్శించకుండా కామ్ గా ఉన్నాం. కనీసం తెలంగాణలో పోటీచేసిన 8 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు పర్యటించలేదన్నది అడిగాం.

వాస్తవానికి జనసేన ఒంటరి పోరుకు ప్రాధాన్యమిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే 33 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇంతలో బిజెపి నాయకత్వం పవన్ ను ఆశ్రయించింది. మద్దతు తెలపాలని కోరింది. కానీ పొత్తు కుదుర్చుకుంటే ఓకే.. మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని జనసేన వర్గాలు అధినేత పై ఒత్తిడి తెచ్చాయి. దీంతో పవన్ సైతం పొత్తు కుదుర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. బిజెపి హై కమాండ్ తో చర్చలు జరిపిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది స్థానాలను జనసేనకు కేటాయించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంతో పాటు ఖమ్మం తదితర జిల్లాల్లో మిగతా సీట్లు కేటాయించారు. ఉమ్మడి అభ్యర్థుల తరఫున చివరి నిమిషంలో పవన్ ప్రచారం చేశారు. కానీ కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ఓటమి చవి చూడడం పవన్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. తెలుగుదేశం పార్టీతో పాటు సెటిలర్స్, బిజెపి మద్దతు లభిస్తుందని భావించినా.. అటువంటిదేమీ లేకుండా పోయింది. జనసేన అభ్యర్థులు ఓటమి చవిచూడక తప్పలేదు.

తెలంగాణలో పోటీ చేసే విషయంలో పవన్ తప్పటడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఏ పార్టీకి మద్దతు తెలపకుండా ఉండి ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అయినా వినిపించుకోలేదు. కనీసం బిజెపికి బయట నుండి మద్దతు తెలిపి ఉంటే ఈ స్థాయి ఓటమి ఎదురయ్యేది కాదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని పవన్ ముందుగానే లైట్ తీసుకున్నారు. ఎన్డీఏ లో ఉండడంతో బిజెపితో కలవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. కేవలం ఏపీలో వ్యూహం కోసమే తెలంగాణలో జనసేన పోటీ చేసిందన్నకామెంట్ కూడా ఉంది. తెలంగాణలో ఎదురైన చేదు ఫలితాలతో బిజెపి ఒక మెట్టు దిగుతుందని.. ఏపీలో టిడిపి జనసేన కూటమితో కలిసి వస్తుందని.. అందుకే అక్కడ స్నేహాన్ని పవన్ అందించారని.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఆ మూడు పార్టీలు కలిసే వెళ్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.