Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : రెండు సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి.. నేను ఏమి చేయలేకపోతే రాజీనామా...

Pawan Kalyan : రెండు సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి.. నేను ఏమి చేయలేకపోతే రాజీనామా చేస్తాను : పవన్ కళ్యాణ్

Pawan Kalyan : రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత నిర్వహిస్తున్న ‘వారాహి యాత్ర ‘ చుట్టూనే తిరుగుతున్నాయి. నిన్న కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ స్పీచ్ తో ‘వారాహి యాత్ర’ ఘనంగా ప్రారంభమైంది.  ఈ ప్రసంగంలో ఆయన జనసేన పార్టీ అధికారం లోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతానో చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా నైపుణ్యం ఉన్న యువతకు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే 10 లక్షల రూపాయిల పెట్టుబడి జనసేన ప్రభుత్వం ఇస్తుంది అనే మాట యువతని ఎంతో ఆకట్టుకుంది.

ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ , ఆర్ధిక కష్టాలు ఉండడం వల్ల , వ్యాపారాలు చేయలేకపోతున్న యూత్ మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ హామీ ఎంతో మందిలో కొత్త ఆశని చిగురించేలా చేసింది. సంక్షేమ పథకాలకు బదులుగా ఇలా జీవితం స్థిరపడిపోయే గొప్ప పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తున్నారు.

ఇక నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొంత మంది ముఖ్యమైన ప్రముఖులతో భేటీ అయ్యాడు.  కాసేపటి క్రితమే ఆయన చేబ్రోలు చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు , కార్మికులలో నమ్మకం నిలిపాయి.

ఆయన మాట్లాడుతూ ‘మీరు జనసేన పార్టీ ని నమ్మి గెలిపిస్తే, మీ కష్టాలను ఎలా తీరుస్తానో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ చేబ్రోలు ని సిల్క్ సిటీ గా చేసి చూపిస్తాను. అలాగే నేను ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నా కూడా , ఎప్పుడూ పదవులను అడగలేదు. కానీ మీకోసం, నేను GST గురించి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టెలాగా చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీని నమ్మి ఓటు వెయ్యండి. మేము మీకు ఇచ్చిన హామీలను రెండేళ్లలో నెరవేర్చలేదు అంటే , మీ అసంతృప్తి ని వ్యక్తపరచండి. నేను రాజీనామా చేసేస్తాను’ అంటూ  పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.

పవన్ ఇంత ధైర్యంగా ప్రజలకే పనిచేయకపోతే రాజీనామా చేస్తానన్న మాట ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో అందరినీ కదిలిస్తోంది. పవన్ పై విశ్వాసం కలిగేలా చేస్తోంది. పవన్ అభ్యర్థన చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఆయనకే ఓటు వేయాలన్న నమ్మకం జనాల్లో కలుగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version