Bro Movie Review: ‘బ్రో’ మూవీ రివ్యూ

టైం అనే దేవుడి పాత్రలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు ఈ హీరో. ఇక ముందు నుంచి అనుకున్నట్టు ఒక 15 నిమిషాల పవన్ క్యారెక్టర్ మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మావయ్యతో మొదటి సినిమా అనో ఏమో తెలియదు కానీ, తాను కూడా నటన ఈ చిత్రంలో ఇరగదీసారు.

Written By: Swathi, Updated On : July 28, 2023 9:19 am

Bro Movie Review

Follow us on

Bro Movie Review: ఫైనల్ గా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా విడుదల అయిపోయింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తున్నాము అంటూ.. వయ్యారిభామ సాంగ్ ని అప్పుడే అందరూ స్టేటస్ లు కూడా పెట్టేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

– కథ

ఈ సినిమా మార్కండేయులు (సాయి ధరమ్‌ తేజ్‌) అనే బిజీ పర్సన్ చుట్టూ తిరుగుతుంది. మార్కండేయ కి చిన్న వయసులోనే తండ్రి చనిపోతాడు. మార్కండేయ కి ఇద్దరూ చెల్లెలు అలానే ఒక తమ్ముడు ఉంటారు. ఇక తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అన్ని అతనే తీసుకుంటారు. ఇక తాను ఉన్న బిజీ షెడ్యూల్లో అందరి దగ్గర నాకు టైం లేదు టైం లేదు అని చెబుతూ ఉంటారు. అతనికి ఇంట్లో, పని చేసే చోట మంచి పేరు, మర్యాదలు ఉంటాయి. కానీ ఒకరోజు అతను కారులో వెళుతుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోతాడు. చనిపోయిన సాయిధరమ్ కు అప్పుడే దేవుడు లాంటి  ‘కాలం’ అనే పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ మద్దతుగా నిలుస్తాడు.  మార్కండేయ  చనిపోయిన తరువాత కూడా కొన్ని కండిషన్లు పెట్టి 90 రోజుల జీవితాన్ని ప్రసాదిస్తాడు.  అప్పుడు మార్కండేయతోనే  కథ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ 90 రోజులు మార్కండేయ ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి తరువాత ఏమైంది అనేది మిగిలిన కథాంశం.

– నటీనటుల పర్ఫార్మెన్స్.. టెక్నికల్ సిబ్బంది పనితీరు

పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైం అనే దేవుడి పాత్రలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు ఈ హీరో.  ఒక 15 నిమిషాల పవన్ క్యారెక్టర్ మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్స్ లో మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తాం.  పవన్ కళ్యాణ్ పక్కన సాయిధరమ్ తేజ్ కూడా తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మావయ్యతో మొదటి సినిమా అనో ఏమో తెలియదు కానీ, తాను కూడా నటనలో  ఇరగదీసారు. ఇక మిగతావారు తమ పాత్ర పరిధిలో బాగా నటించారు.

టెక్నికల్ సిబ్బంది పనితీరు విషయానికి వస్తే ఈ సినిమా తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సితమ్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే మన తెలుగు సినిమాకి తగినట్టు దర్శకుడు సముద్రఖని చాలా మార్పులు చేశారు.  కొన్ని చోట్ల ఇది ఒరిజినల్ కన్నా సూపర్ గా ఉన్నా.. మరికొన్ని సీన్లలో  మాత్రం కొంచెం డల్ గా అనిపించింది.

అంతేకాకుండా పవన్ ఇమేజ్ కోసం యాక్షన్ సీన్లు పొలిటికల్ పంచ్ లు, పంచ్ డైలాగులు పెట్టడం పవన్ ఫ్యాన్స్ తో  విజల్స్ కొట్టిస్తుంది. అయితే సాధారణ ప్రేక్షకులకి ఇవి అంతగా ఎక్కుతాయా లేదా అనేది సందేహం మాత్రం ఉంది. థమన్ అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

-విశ్లేషణ

ఒరిజినల్ సినిమా వినోదయ సిత్తమ్ కి ఈ సినిమాకి చాలా తేడాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ను   దర్శకుడు చూపించిన తీరు మాత్రం ప్రశంసనీయం. మొదటి సగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే రెండో సగంలో కొంచెం ఎడిటింగ్ పదును పెట్టుంటే ఇంకా బాగుందేమో. అలానే  పాత్రల విషయం.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే బాగుండు.

అయితే ఈ సినిమాలోని మైనస్ లు అన్నీ కూడా తమ యాక్టింగ్ తో పవన్ కళ్యాణ్ , సాయిధరమ్ తేజ్  చాలావరకు కవర్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓల్డ్ సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.  స్టోరీ లో చేసిన మార్పులు వల్ల సినిమా ఫరవాలేదు అనిపించినా పవన్ కళ్యాణ్ తను యక్టింగ్ తో మెస్మరైజ్ చేసి సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు.

-తీర్పు

పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ హిట్ మామూలు ప్రేక్షకులకు యవరేజ్ హిట్ గా మిగిలే సినిమా..

-రేటింగ్ 2.75 / 5