Pawan Kalyan : తెలుగుదేశం దూకుడులో సగమైనా జనసేన ప్రదర్శించాలి

పవన్ నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు.. సొంత డబ్బు ఖర్చు పెట్టే ఉదారవాది.. జాతీయ భావనలు కలిగి ఉన్నాడు. కాకపోతే మేం అనుకున్నట్టుగా పనిచేయడం లేదన్న బాధ, ఆవేదన జనసైనికులు ఉన్నారు.

Written By: NARESH, Updated On : December 30, 2023 12:36 pm

Pawan Kalyan : 2023 సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. వారాహి యాత్రతో ఆంధ్రాను పవన్ షేక్ చేస్తారని అనుకున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం సగం అయినా కవర్ చేస్తారని అనుకున్నారు. కనీసం 75 నియోజకవర్గాలు తిరుగుతారని భావించారు. 2023లో ఉదృతంగా షెడ్డూకు వెళ్లిందో తెలియదు.. ఎందుకు సడెన్ బ్రేక్ పడిందో తెలియదు. జనసైనికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పవన్ తిరిగారు? దీనికి జగన్ నా? చంద్రబాబునా బ్లేయిమ్ చేసేది.. పవన్ దే తప్పు.. స్వయం కృతాపరాధం.. ఎంతోమంది పవన్ ను నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్లందరి ఆశలు మోస్తున్న పవన్ వాటిని నెరవేర్చాలి కదా..

జనసైనికుల దృష్టిలో మూడో శక్తి పవన్ అని అనుకున్నారు. ఎప్పుడూ జగన్, చంద్రబాబు యేనా? అని అందరూ అనుకున్నారు. మూడో ప్రత్యామ్మాయంగా పవన్ ఆశాకిరణంలా కనిపించారు.

పవన్ నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు.. సొంత డబ్బు ఖర్చు పెట్టే ఉదారవాది.. జాతీయ భావనలు కలిగి ఉన్నాడు. కాకపోతే మేం అనుకున్నట్టుగా పనిచేయడం లేదన్న బాధ, ఆవేదన జనసైనికులు ఉన్నారు.

తెలుగుదేశం దూకుడులో సగమైనా జనసేన ప్రదర్శించాలి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.