CM Jagan: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ నిన్న పర్యటించారు. విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. పవన్ ను టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. పవన్ వైవాహిక జీవితం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్లను మార్చినంత ఈజీగా భార్యలను మార్చుతారని.. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే భీమవరం పర్యటనలో ఒక ఆసక్తికర ఘటన సైతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భీమవరం పర్యటనలో భాగంగా స్థానిక లూథరన్ గ్రౌండ్స్ లో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. పర్యటన ముగించుకొని సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు చేరుతున్న క్రమంలో అక్కడ చేరిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ తరుణంలో ఇద్దరు దంపతులు తమ ఐదు నెలల చిన్నారిని పట్టుకొని వేచి ఉండడం కనిపించింది. దీంతో అతి దగ్గరకు వెళ్లి జగన్ ఆరా తీశారు. తమకు రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానమని.. తమకు ఐదు నెలల కిందట బాబు పుట్టాడని మోహన్ కుమార్, సోనీ దంపతులు తెలిపారు. దీంతో సీఎం జగన్ అక్కడ కొద్దిసేపు ఆగి ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. దీంతో ఆ దంపతులు ఎంతో సంతోషపడ్డారు. చిన్నారికి పేరు పెట్టాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావడంతో.. సీఎం జగన్ ఆ చిన్నారికి రాజశేఖర్ అని పేరు పెడుతూ ముద్దాడారు. దీంతో ఆ దంపతుల సంతోషం అంతా ఇంతా కాదు.
ఈ ఏడాది ఆగస్టులో గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చాయి. పంటలకు నష్టం జరిగింది. ఆ సమయంలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. అప్పట్లో ఓ చిన్నారికి సీఎం జగన్ పేరు పెట్టారు. ఇలానే ఓ దంపతులు వచ్చి చిన్నారిని చేతిలో పెట్టి పేరు పెట్టాలని కోరారు. అది కూడా డి అనే అక్షరం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం జగన్ క్షణం ఆలోచించకుండా దేవుడు అనే పేరు పెట్టారు. ఇప్పట్లాగే ఆ చిన్నారిని ముద్దాడి పేరు పెట్టడంతో నాడు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడ్డారు. తన పర్యటనలో ఇలా పేర్లు పెట్టడం కూడా జగన్ కు కొత్త అనుభూతినిచ్చినట్టే.
చిన్నారికి నామకరణం చేసిన జగనన్న..
భీమవరంలో సీఎం వైయస్ జగన్ గారు ఓ చిన్నారికి నామకరణం చేశారు. చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు తమ ఐదు నెలల బిడ్డని తీసుకుని జగనన్న వద్దకి వచ్చి పేరు పెట్టాలని కోరారు. దాంతో ఆ చిన్నారిని ప్రేమతో దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ‘రాజశేఖర్’గా… pic.twitter.com/j7q1dyAX6m
— YSR Congress Party (@YSRCParty) December 30, 2023