Homeఅంతర్జాతీయంIndia- Pakistan: మోదీ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బ!

India- Pakistan: మోదీ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బ!

India- Pakistan: విశ్వగురువుగా కీర్తి ఘడిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కొట్టిన దెబ్బకు దాయాది దేశం పాకిస్తాన్‌ అబ్బా అంటోంది. గతంలో భారత్‌ నుంచి అందిన సహకారంతో రెచ్చిపోయిన పాక్‌ను ఇప్పుడు అడుక్కుతినే స్థాయికి దిగజారింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత దేశ నాశనాన్ని కోరుకున్న దాయాది దేశం ఇక ఎప్పుడూ యుద్ధం చేయం బాబూ మమ్మల్ని ఆదుకోండి అని వేడుకుంటోంది. ఈ పరిస్థితికి కారణం ప్రధాని మోదీ చేసిన శపథం.

India- Pakistan
India- Pakistan

-స్నేహంగా ఉందామని..
2014లో మొదటిసారి అధికారం చేపట్టాక ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశం పాకిస్తాన్‌తో స్నేహం కోరుకున్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడం ద్వారా రెండు దేశాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. ఇందుకోసం పాకిస్తాన్‌ ఆహ్వానించకపోయినా 2015లో కరాచీ వెళ్లారు. నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో పెళ్లికి హాజరయ్యారు. షరీఫ్‌ తల్లికి చీర బహూకరించారు. స్వాతంత్య్రానికి ముందు పరిస్థితిని గుర్తుచేశారు. కలిసి పనిచేద్దామని, ఉగ్రవాదాన్ని అంతం చేద్దామని కోరారు.

-వక్రబుద్ధి పోనిచ్చుకోని పాక్‌..
కుక్కతోక వంకర అన్న చందంగా పాక్‌ తన వక్రబుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు. భారత్‌లోని కొన్ని శక్తుల నుంచి అందుతున్న సహకారంతో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. 2016లో భారత్‌పై ఉగ్రదాడికి కారణమైంది. ఇందులో 17 మంది భారత సైనికులు మృతిచెందారు. ఇది మోదీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సైనికులకు నివాళులర్పించేందుకు కశ్మీర్‌ వెళ్లిన మోదీ పాకిస్తాన్‌ను అడుక్కుతినే స్థాయికి తెస్తానని ప్రకటించారు. ఈమేరకు 2016 చివరిలో పెద్దనోట్లు రద్దు చేశారు. ఇది పాకిస్తాన్‌కు మొదటి దెబ్బ. నోట్ల రద్దుతో పాకిస్తాన్‌ ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటి వరకు భారత్‌ కరెన్సీని అక్రమంగా ముద్రించి చెలామణి చేసిన పాక్, నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేయలేని పరిస్థితికి చేరుకుంది. అప్పటికే 12 వేల కోట్ల నకిలీ కరెన్సీని ముద్రించి మార్కెట్‌లోకి చెలామణి చేసినట్లు కేంద్రం గుర్తించింది.

India- Pakistan
India- Pakistan

-అంతర్జాతీయ వేదికలపై ఒంటరి..
ఇదే సమయంలో 2019లో మరోమారు పాక్‌ భారత్‌పై దాడికి తెగబడింది. అదే ఏడాది ఏప్రిల్‌లో జగిరిన పార్లీమెంట్‌ ఎన్నికల్లో మరోమారు మోదీ అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్‌ను ఇక తీవ్రస్థాతయిలో దెబ్బకొట్టాలని సంకల్పించారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరిని చేయడంలో విజయం సాధించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్ని ఆర్థికసాయం చేయకుండా అగ్రదేశాలను నిలువరించగలిగారు. దీంతో పాకిస్తాన్‌ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆకలితో అలమటిస్తోంది. భికాందేహీ అంటూ అడుక్కునే స్థాయికి దిగజారింది.

-అంతర్గత పోరు ఉధృతం..
పాకిస్తాన్‌లా దొడ్డిదారిన కాకుండా నీతిగా, న్యాయంగా పాకిస్తాన్‌ను ఈ స్థితికి తీసుకొచ్చారు మోదీ. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్న అక్కడి ప్రజలు అంతర్గత యుద్ధానికి తెరతీశారు. పీవోకేలోని ప్రజలు స్వచ్ఛందంగా తాము భారత్‌లో కలుస్తామని అంటున్నారు. సింధ్ ప్రాంతంలోనూ అంతర్గత యుద్ధం మొదలైంది. తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌ నుంచి విడిపోయి అభివృద్ధి చెందిందని, తాము కూడా సింధుదేశ్‌గా విడిపోయి అభివృద్ధి చెందుతామని, భారత్‌ సహకారం తీసుకుంటామని అక్కడి ప్రజలే నినదిస్తున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో పాకిస్తాన్‌ ఇప్పుడు చీలిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు పరిశీలకులు.

-యుద్ధం చేయమని ప్రధాని ప్రకటన..
దేశంలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న పాక్‌ ప్రధాని నేరుగా భారత దేశాన్ని సాయం అడిగేందుకు ముఖం చెల్లక యూఏఈ ద్వారా రాయబారం నడుపుతున్నారు. భారత్‌తో తాము ఎప్పుడు ఇక యుద్ధం చేయమని, అణ్వస్త్రాలు ప్రయోగించమని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు సహకరిస్తామని పేర్కొంటున్నారు. భారత్‌ ద్వారా సాయం ఇప్పించాలని వేడుకుంటున్నారు. అయితే జిత్తులమారి పాక్‌ను నమ్మడానికి లేదని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌ను నమ్మితే పాముకు పాలుపోసి పెంచినట్లే అవుతుందని పేర్కొంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular