NTR Speech: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా రాబోతున్న ‘బింబిసార’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ముఖ్యంగా ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. సహజంగా ఇలాంటి ఈవెంట్స్ కి ఎన్టీఆర్ వస్తే.. ముందుగా ఎన్టీఆర్ స్పీచ్ కోసమే సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా తన పవర్ ఫుల్ స్పీచ్ తో ఎప్పటికప్పుడు అంచనాలను అందుకుంటూనే వస్తున్నాడు. నిజానికి ఇలాంటి స్టేజ్ ల పై సినిమా సూపర్ హిట్ కాబోతుందని, రిలీజ్ కి ముందే చాలా పాజిటివ్ గా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి.

ఎందుకంటే.. సినిమా రిలీజ్ అయ్యాక, మాట్లాడిన మాటల్లో నిజం లేదని తెలిస్తే క్రెడిబులిటీ పూర్తిగా దెబ్బ తింటుంది. ప్రస్తుతం దిల్ రాజు లాంటి వ్యక్తులు ఎదురొంటున్న అతి పెద్ద సమస్య ఇదే. అయితే, ఈ క్రెడిబులిటీ విషయంలో ఎన్టీఆర్ తన పై ఉన్న నమ్మకాన్ని చాలాసార్లు నిలబెట్టుకున్నాడు. ఐతే, ఇలాంటి ఎన్టీఆర్.. ‘బింబిసార’ సినిమా డైరెక్టర్ వశిష్ట గురించి చెప్పిన మాటలే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏం మాట్లాడాడు అంటే..
‘దర్శకుడు వశిష్ట గురించి నాకు ముందే తెలుసు. మొదట తను ఒక ఐడియాగా బింబిసార కథ చెప్పాడు, మొదట్లో సినిమా ఎలా తీస్తాడా ? అని డౌట్ ఉండేది. కానీ, అనుభవం లేకపోయినా ఇంత పెద్ద చిత్రాన్ని ఎంతో కసితో తెరకెక్కించాడు’ అని చెప్పిన ఎన్టీఆర్, ఆ తర్వాత దర్శకుడు వైపుకు తిరిగి ‘హ్యాట్సాఫ్.. హ్యాట్సాఫ్ వశిష్ట’ అంటూ ఎమోషనల్ అవ్వడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తారక్ ఇలా చెబుతున్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశ్చర్యచకితులు అయ్యారు. వాస్తవానికి ‘బింబిసార’ సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అలాంటిది ఎన్టీఆర్ ఏమిటి, ఇంతగా దర్శకుడిని పొగిడాడు ? అని సినిమా జనం కూడా చర్చ మొదలుపెట్టారు.

నిజంగా ‘బింబిసార’ సినిమా అంత బాగుందా ?, ఎన్టీఆర్ ఆల్ రెడీ సినిమా చూశాడు. ఎన్టీఆర్ జడ్జ్ మెంట్ కరెక్ట్ గానే ఉంటుంది. అసలు ఎన్టీఆర్ కి ‘బింబిసార’ సినిమా ఎంతగా నచ్చకపోతే.. అంతగా ఉద్విగ్నతకు గురవుతాడు ?. అలాగే, సినిమా ఎంతో గొప్పగా ఉండబట్టే.. రేపు థియేటర్లలో ప్రేక్షకులు కూడా తనలాగే ఉద్విగ్నతకు గురవుతారని ఎన్టీఆర్ చెప్పి ఉంటాడు. అన్నిటికీ మించి భవిష్యత్తులో దర్శకుడు వశిష్ట నుంచి ఎన్ని గొప్ప చిత్రాలు రాబోతున్నాయని కూడా ఎన్టీఆర్ సర్టిఫై చేశాడు. ఇప్పుడు ఈ స్పీచే వశిష్ట పాలిట వరంలా మారింది. నిన్న రాత్రి నుంచే అతని ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉందట. వశిష్ట కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు. యువీ వంశీ, నిర్మాత అనిల్ సుంకర ఇప్పటికే వశిష్టకి రెండు కోట్లు అడ్వాన్స్ లు కూడా పంపించారట. మొత్తానికి ఎన్టీఆర్ స్పీచ్ దెబ్బకు వశిష్ట లైఫే మారిపోయింది. ఈ అవకాశాలను వశిష్ట సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.