Allu Arjun New Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రేక్షకులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బన్నీ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రేంజ్ లో ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మునుపెన్నడూ కనిపించని విధంగా పూర్తి డిఫరెంట్ మేకోవర్ లోకి బన్నీ ఒదిగిపోయిన విధానం అద్భుతం. రింగులు తిరిగిన జుత్తు, లైట్ గా నెరిసిన గడ్డం, నోట్లో సిగార్, చెవికి పోగు.. అచ్చం మాఫియా వరల్డ్ కి నిజమైన గ్యాంగ్ స్టార్ గా కనిపించాడు బన్నీ. ఇంతకీ బన్నీ ఉన్నట్టు ఉండి ఈ లుక్ లోకి ఎందుకు మారిపోయాడో తెలుసా ?, ఎందుకంటే ఓ యాడ్ ఫిల్మ్ కోసం.

ఈ యాడ్ కు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే, త్రివిక్రమే దగ్గర ఉండి బన్నీ లుక్ ను ప్రత్యేకంగా డిజన్ చేశాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ సినిమాకి కూడా ఒక హీరో ఈ రేంజ్ లో తన లుక్ ను స్టైలిష్ గా మార్చుకోలేకపోయాడు. అలాంటిది కేవలం ఒక యాడ్ కోసం బన్నీ ఇంతగా తన గెటప్ అండ్ సెటప్ మార్చుకోవడం రియల్లీ గ్రేట్. ఇంతగా మార్పు ఒక్క బన్నీకే సాధ్యం.
Also Read: Jayasudha ABN RK: నటిగా 50 ఏళ్లు.. అయినా పద్మశ్రీ లేదు. జయసుధ ప్రశ్నలకు జవాబులున్నాయా?
ఎంతైనా బన్నీ డ్రసింగ్, హెయిర్ స్టైల్.. సూపర్ స్టైలిష్ గా ఉంటాయి. అందుకే.. టాలీవుడ్ కి స్టైలిష్ స్టార్ అయ్యాడు. నిజానికి బన్నీ మొదటి సినిమా గంగోత్రి సినిమాలో బన్నీని చూసి.. ‘ఏమిటి ఇతను హీరోనా ?’ అన్న వాళ్లందరి చేత.. ‘యస్ హీరో అంటే ఇతనే’ అనిపించాడు. సాధారణమైన కుర్రాడి లుక్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదగడానికి బన్నీ చేసిన కృషి అమోహం. అనీర్వచనం.

అందుకే.. ప్రతిభకు అల్లు అర్జున్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు, హీరో అవ్వాలని ఆశ పడే అతి సాధారణ కుర్రాళ్లకు బన్నీ నిజమైన ఆదర్శంగా నిలిచాడు. ఇక్కడ మరో విషయం కూడా ప్రత్యేకంగా చెప్పుకొవాలి. సక్సెస్ రాగానే ఎవరైనా కొంత రిలాక్స్ అవుతారు. కానీ, స్టార్ అయ్యాక కూడా బన్నీ ఎన్నడూ ఎప్పుడూ రిలాక్స్ కాలేదు. ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని బన్నీ నిత్యం తపన పడుతూనే ఉంటాడు.
మెగాస్టార్ కి స్వయానా మేన అల్లుడు అయినా.. బడా నిర్మాత వారసుడు అయినా ఎన్నడూ వారి సాయం కోరని సినీ కార్మిక హీరో బన్నీ. మొదట్లో హీరోగా స్టార్ డమ్ రాకపోయినా.. తనలోని ప్రతిభనే నమ్ముకొని స్టార్ గా సక్సెస్ అయిన అసలు సిసలైన స్టార్ బన్నీ. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో నీరాజనాలు పలుకుతున్నారు. ‘డియర్ బన్నీ ఇలాగే నీ పయనం కొనసాగించు. ఆల్ ది బెస్ట్.