Nitish Kumar : ఈనెల 23వ తేదీన బీహార్ సీఎం నితీష్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ఐక్య సదస్సు జరుగబోతోంది. నితీష్ దీనికి చొరవ చూపుతున్నారు. ఈ సదస్సు ఏదో ఫొటో షూట్ లాగా ఉంది తప్పితే.. దీని కోసం నిజంగా.. సరిగ్గా ప్రణాళికబద్దంగా కసరత్తు జరిపినట్టు మాత్రం కనిపించడం లేదు. నితీష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు ప్రముఖ ప్రతిపక్ష నేతలు పాల్గొనడం లేదు.
జాతీయ పార్టీ అయిన బీఎస్పీ అధినేత్రి మాయవతి పాల్గొనడం లేదు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా రావడం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కూడా హాజరు కావడం లేదు. పూర్వ ప్రధాని, కర్ణాటకకు చెంది దేవెగౌడ కూడా రావడం లేదు.
మరీ ఈ ప్రతిపక్షాల సభకు ఎవరు వస్తున్నారంటే ఎవరికీ అర్థం కావడం లేదు. కీలకమైన ప్రతిపక్ష నేతల విషయంలో నితీష్ చొరవ చూపడం లేదు. పాల్గొనే పార్టీలు చూస్తే.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలు నితీష్ తీర్మానాన్ని అంగీకరించే పరిస్థితి లేదు.
నితీష్ , వాటి మిత్రుల బలం ఎంత ఎంత? నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్య సదస్సు ఎంత ప్రభావం చూపుతుందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..