Nikhat Zareen: ప్రపంచంలో జరిగే ప్రతీ విజయంలో ఈ మధ్య తెలుగువాళ్లు ఉంటున్నారు. రంగం ఏదైనా అందులో చొచ్చుకుపోయే సత్తా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నిఖిత బాక్సింగ్ లో అత్యున్న స్థానానికి చేరింది. విశ్వవిజేతగా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్స్ లో 52 కిలోల విభాగంలో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ పై 5-0 తేడాతో చిత్తుగా ఓడించి ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్ లతో విరుచుకుపడింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పసిడి సాధించిన ఐదో బాక్సర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు మన దేశం నుంచి మేరీకోమ్, సరితాదేవి, జెన్సీ ఆర్ఎల్, లేఖ కేసీ మాత్రమే పసిడి పతకాన్ని సాధించారు.

తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అత్యున్నత శిఖరాలకు వెళ్లిన నిఖిత ప్రపంచ ఛాంపియన్ షిప్ నిలిచింది. అయితే నిఖిత ఈ స్థితికి మాములుగా రాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. అంతేకాకుండా ఆమె సొంత సీనియర్, ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ తో పోటీపడి వార్తల్లో నిలిచింది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖిత జరీన్ 52 కేజీల వెయిట్ విభాగంలో ఫైనల్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో తొలిసారిగా పాల్గొని ఈ ఘనత సాధించడం విశేషం. నిఖిత 14 సంవత్సరాల వయసులోనే జూనియర్ బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ టైటిల్ ను గెలుచుకుంది. అయితే సీనియర్ స్థాయిలో ఆమె మొదటి విజయం 2019లో ప్రతిష్టాత్మకమైన స్ట్రేంజెర్జా మెమోరియల్ లో చోటుచేసుకుంది.. ఇదే సంవత్సరం ఆసియా ఛాంపియన్ షిప్ లో కాంస్యం పతకం గెలుచుకుంది. ఇక్కడి నుంచి నిఖిత ప్రయాణం ఆగలేదు. ఇదే ఉత్సాహంతో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకోవాలని పట్టుబట్టింది.

2019లో నిఖిత ప్రపంచ ఛాంపియన్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అప్పటికే మేరీ కోమ్ భారతీయ బాక్సింగ్ పై చెలాయిస్తున్న ఆధిపత్యంతో నిఖితకు గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే 2019లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లకు బాక్సర్లను ట్రయల్స్ కు పంపారు. అయితే ఇందులో మేరీ కోమ్ 51 కేజీల్లో నెంబర్ వన్ గా నిలిచారు. నిఖితతో పాటు మరో ఇద్దరు బాక్సర్లు కూడా పోటీ పడ్డారు. కానీ నిఖిత సెలెక్షన్ నిలిపివేశారు. అయితే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులు నిఖితను కాదని కావాలనే మేరీకోమ్ ను ఎంపిక చేశారని కొన్న వార్తలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఇది తప్పని నిఖిత డిమాండ్ చేసింది. కానీ ఫెడరేషన్ తో పాటు మేరీ కోమ్ కూడా పట్టించుకోలేదు. ఫలితంగా మేరీకోమ్ 2019లో ఛాంపియన్ షిప్ లో పాల్గొని కాంస్యం గెలుచుకుంది.
ఈ సమయంలో బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ చేసిన ఓ ప్రకటన వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకాలు గెలిచిన ఆటగాళ్లు ఒలంపిక్స్ లోకి వెళ్లేందుకు నేరుగా క్వాలిఫై పొందుతారని అన్నారు. మేరీ కోమ్ సహా ఇతర బాక్సర్లను ట్రయల్స్ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. బీఎఫ్ఐ అధ్యక్షుడి ప్రకటన తో ఫెడరేషన్ విభేదించింది. ఇదే సమయంలో నిఖిత తన హక్కుల కోసం పోరాడింది. ట్రయల్స్ కు తనకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ కూడా రాశారు. దీనిపై మంత్రి స్పందించారు. మొత్తంగా బీఎఫ్ఐ డిసెంబర్ 2019లో ట్రయల్స్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఇందులో నిఖితను మేరీకోమ్ ఓడించింది.

మూడేళ్ల తరువాత నిఖిత ఇప్పుడు మరోసారి మేరీకోమ్ తో పోటీపడింది. రింగ్ లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే యువతకు వచ్చిన అవకాశం అని మేరీకోమ్ వైదొలగింది. దీంతో ఇప్పుడు నిఖితపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కిందట ఆమె చేసిన బాక్సింగ్ పోరాటంతో పాటు హక్కుల పోరాటాన్ని గెలిచే దారులు పడ్డాయి.ఇప్పుడు ప్రపంచ చాంపియన్ నిలవడంతో నిఖిత పోరాటం ఫలించినట్టైంది. దేశమంతా నిఖిత ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆటలోనే కాదు.. జీవితంలోనూ పోరాడి గెలిచిందని ప్రశంసిస్తున్నారు.
Also Read: NTR- Koratala Movie Motion Poster: ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్
[…] […]