https://oktelugu.com/

Political Parties Campaigns: ముందుగానే ప్రజాక్షేత్రంలోకి పార్టీలు.. తెలుగు రాష్ట్రాల్లో మారిన పొలిటికల్ ట్రెండ్

Political Parties Campaigns: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతానికి భిన్నంగా రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ప్రజల బాట పట్టాయి. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండగానే అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. పట్టునిలుపుకునేందుకు అధికార పక్షాలు.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలు చేయని ప్రయత్నాలు లేవు. ఒక పక్క పొత్తు ప్రయత్నాలు సాగుతుండగా.. మరోపక్క ప్రజల మద్దతు కూడగట్టేందుకు అధినేతలు, ఆయా పార్టీల నేతలు జిల్లాలను చుట్టేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికలు దగ్గర […]

Written By:
  • Dharma
  • , Updated On : May 20, 2022 / 11:29 AM IST
    Follow us on

    Political Parties Campaigns: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతానికి భిన్నంగా రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ప్రజల బాట పట్టాయి. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండగానే అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. పట్టునిలుపుకునేందుకు అధికార పక్షాలు.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలు చేయని ప్రయత్నాలు లేవు. ఒక పక్క పొత్తు ప్రయత్నాలు సాగుతుండగా.. మరోపక్క ప్రజల మద్దతు కూడగట్టేందుకు అధినేతలు, ఆయా పార్టీల నేతలు జిల్లాలను చుట్టేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికలు దగ్గర పడితేనే ప్రజాక్షేత్రంలో కనిపించే నేతలు, ఇప్పుడు ఎన్నికలకు రెండు, మూడు సంవత్సరాల ముందు నుండే ప్రజల మద్దతు కూడగట్టడానికి శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరకు వెళితే ప్రజల మద్దతు లభించదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల తీరు బాగా మారినట్టుగా కనిపిస్తోంది. పొలిటికల్ ట్రెండ్ మారినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు పోరాటబాట పట్టాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు వైసీపీ, టీఆర్ఎస్ ఆరాటపడుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

    Political Parties

    ఏపీలో పోటాపోటీగా
    ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రధాన విపక్షాలు రకరకాల కార్యక్రమాలతో ప్రజల మధ్యనే ఉండేందుకు ఇష్టపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కార్యక్రమం చురుగ్గా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూడా దాదాపు అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ బాదుడే బాదుడులో పాల్గొంటున్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడంతో కార్యక్రమాన్నికొన్ని రోజుల పాటు కొనసాగించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు జనసేన కూడా స్వరం పెంచింది. పవన్ కళ్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర పేరిట రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పర్యటనలు పూర్తిచేశారు. త్వరలో ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 3 వేల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున బాధిత కుటుంబానికి పవన్ నగదు అందిస్తున్నారు.

    Also Read: YCP- Bendapudi Students: ఆ విద్యార్థుల ప్రతిభను వైసీపీ భలే క్యాష్ చేసుకుంటోంది

    ఇందుకుగాను రూ.30 కోట్లతో ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడంతో జనసేనలో దీమా తొణికిసలాడుతోంది. మరిన్ని కార్యక్రమాల రూపకల్పనలో జనసేన కీలక నాయకులు బీజీగా ఉన్నారు. అయితే విపక్షాలకు దీటుగా వైసీపీ ‘గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమం అభివ్రుద్ధి పనులు తెలియజెప్పేందుకు కార్యక్రమాన్ని రూపొందించింది. అయితే ఎక్కడికక్కడే ప్రజల నుంచి నిలదీతలు, నిరసనలు వ్యక్తమవుతుండడంతో వైసీపీకి ప్రతిబంధకంగా మారింది. వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం ప్రజల మధ్యకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులతో సామాజిక బస్సు యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించారు. అదీ కూడా నాలుగు ప్రాంతాల్లోని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నిర్వహణకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నాలుగు ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టింది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, నిర్వాసితుల సమస్యల పరిష్కరానికి యాత్రం చేపట్టింది. దీనికి కూడా ప్రజల నుంచ విశేష ఆదరణ లభించింది. వామపక్షాలు సైతం ఇప్పటికే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ ప్రజల మధ్యనే ఉంటున్నాయి.

    Political Parties

    తెలంగాణలో..
    ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఇక ఈ దఫా ఎలాగైనా గెలవాలని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెడుతూ జిల్లాల పర్యటన చేపట్టింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ వివిధ జిల్లాలో పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం గతంలో లేని విధంగా వ్యూహాత్మకంగా ఇప్పటి నుండే ముందుకు వెళ్తున్నారు.మరోపక్క బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రలు చేస్తూ, గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ పల్లెపల్లెకూ కాంగ్రెస్ పేరుతో పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగా నేతలు ప్రజల వద్దకు పరుగులు పెడుతున్నారు.ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్నా.. ఇప్పటి నుండే పొలిటికల్ హీట్ ప్రజల్లోనే ఉండాలి అనుకుంటున్న నేతలు, ప్రజల ఆశీర్వాదం కోసం, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు. అంటే ఎన్నికలకు రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ నేతల తీరుతో ఏపీ ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక నేతల మాటలు, ఇస్తున్న హామీలు, ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేస్తున్న విధానం ఎన్నికల హీట్ ను ఇప్పటినుండే పెంచుతుంది.

    Also Read:KCR- Damodara Rao: కేసీఆర్ కు ప్రేమా.. లేక భయమా? ఆయనకు పదవి ఎందుకిచ్చారు?

    Recommended Videos


     

    Tags