New Zealand Vs England: ఎట్టకేలకు ఇంగ్లాండ్ మీద రివెంజ్ తీర్చుకున్న న్యూజిలాండ్…

283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీమ్ కి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది. సామ్ కరణ్ వేసిన బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే విల్లింగ్ డక్ ఔట్ అయిపోయాడు.

Written By: Gopi, Updated On : October 6, 2023 10:08 am

New Zealand Vs England

Follow us on

New Zealand Vs England: వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది.అయితే టాస్ గెలిచి న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది దాంతో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ కి వచ్చింది. ఓపెన్ ప్లేయర్ అయిన జాన్ బెయిర్ స్ట్రో, డేవిడ్ మలన్ ఇద్దరు కూడా కొద్ది వరకు మంచి ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను అందించినప్పటికీ ఆ తర్వాత 14 పరుగులు చేసిన డేవిడ్ మలన్ అవుట్ అవ్వడం జరిగింది.

ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన జో రూట్ తనదైన స్టైల్ తో కొంతవరకు న్యూజిలాండ్ బౌలర్ లను ఇబ్బంది పెట్టడనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరూ కలిసి కొద్దిసేపు బాగానే ఆడినప్పటికీ ఇన్నింగ్స్ బిల్డ్ అవుతుంది అనుకున్న టైంలో వికెట్ కోల్పోవడం జరిగింది. 35 బంతుల్లో 33 పరుగులు చేసిన బెయిర్ స్ట్రో అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ టీమ్ కొంతవరకు కష్టాల్లో పడింది అనే చెప్పాలి. తరువాత వచ్చిన ప్లేయర్లు కూడా పెద్దగా ఆడక పోవడంతో ఇంగ్లాండ్ స్కోర్ 250 కూడా కొడుతుందా లేదా అనే విధంగా పరిస్థితి మారిపోయింది.ఇక జో రూట్ క్రీజ్ లో ఉండగా ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన జోస్ బట్లర్ క్రేజ్ లోకి వచ్చి ఇద్దరు చాలా బాగా ఆడారు. అందులో జోస్ బట్లర్ 42 బంతుల్లో రెండు సిక్స్ లు, రెండు ఫోర్లు కొట్టి 43 పరుగులు చేసి మాట్ హెండ్రీ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇక జో రూట్ కూడా 77 పరుగులు చేసిన తర్వాత తను కూడా అవుట్ అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ టీమ్ లో మిగిలిన వారందరూ కూడా చాలా తక్కువ స్కోరు చేయడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లకి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. ఒక బౌల్ట్ ఒక వికెట్ తీయగా, మాట్ హెండ్రీ 3 వికెట్లు తీశాడు, అలాగే సాంట్నార్ రెండు వికెట్లు తీశాడు రచన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరూ తలో వికెట్ తీశారు….

ఇక 283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీమ్ కి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది. సామ్ కరణ్ వేసిన బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే విల్లింగ్ డక్ ఔట్ అయిపోయాడు.ఇక దానితో మరో ఓపెనర్ అయిన కన్వే కి తోడు గా రచిన్ రవీంద్ర రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలర్ లకు చుక్కలు చూపించారనే చెప్పాలి. సిక్స్ లు ఫోర్లు కొడుతూ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయేలా చేశారు కేవలం 36 ఓవర్ రెండు బంతులకే న్యూజిలాండ్ తమ టార్గెట్ ను రీచ్ అయింది.ఇక ఇందులో డేవిన్ కాన్వే రచన్ రవీంద్ర ఇద్దరూ కూడా సెంచరీ చేసి బరిలో నిలిచారు. ఇక వీళ్లిద్దరి మధ్య మూడో వికెట్ కి 273 పరుగుల పాత్నార్ షిప్ ని నెలకొల్పారు. డెవిన్ కాన్వే 152 పరుగులు చేయగా రచన్ రవీంద్ర మాత్రం 123 పరుగులు చేశాడు…

ఇక ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తీసి 123 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర వహించిన రచన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం జరిగింది…
ఇక 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ టీమ్ మీద ఓడిపోయిన న్యూజిలాండ్ ఇప్పుడు భారీగానే రివెంజ్ తీర్చుకుంది అనే చెప్పాలి.ఇక దాంతోపాటుగా న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని కూడా దక్కించుకుంది…