New Year 2024: నూతన సంవత్సరం.. ఈ స్మార్ట్‌ యుగంలో డైరీ రాయడం ఎందుకంటే..

మధుర భావనలను విశ్లేషించడానికి అనుభవాలసారంతో జీవన గమ్యాలను నిర్ధేశించుకోవడానికి స్వేచ్ఛగా భావాలను అక్షర నిక్షిప్తం చేసే ఏకైక సాధనం డైరీ. డైరీ రాసే అలవాటు ఉన్న వారిలో మంచి రచణ నైపుణ్యంతో పాటు అంతర్లీన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే భావావేశం ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 31, 2023 6:05 pm

New Year 2024

Follow us on

New Year 2024: మన నిత్య జీవితంలోని సంఘటనలు, అందమైన అనుభూతులు, మధురమైన జ్ఞాపకాలు పదిలపరుచుకునే ప్రతిరూపం డైరీ. మనిషిలోని అంతర్లీన భావాలను పం చుకునే ఒక రైటింగ్‌ డాక్యుమెంట్‌ డైరీగా భావించవచ్చు. నూతన సంవత్సరం ప్రారంభమైందంటే అందరి మనుస్సు అందమైన డైరీలపైనే ఉంటుంది. హస్తభూ షణంగా మనోభావాలు నిక్షిప్తం చేసే రాతప్రతిగా బావించే డైరీ రాయడం, నిర్వహిం చడం ఒక ప్రత్యేకమైన కళ. అబిరుచి. ఆదునిక కాలంలో డిజిటల్‌ డైరీలు సైతం పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చినప్పటికి సాంప్రదాయ సిద్దంగా రాతప్రతులతో కూడిన డైరీలకు సైతం ప్రాధాన్యత తగ్గలేదు. రహస్యాలు పదిలంగా ఉంచుకునే సౌలభ్యం డి జిటల్‌ డైరీలో ఉన్నప్పటికి వ్యక్తిత్వ మనోవికాసానికి దోహదపడే సాంప్రదాయ డైరీ సా ్థనం మాత్రం చెదరలేదు. కంప్యూటర్‌ పరిజ్ఞాం ఉన్నవారు ఎక్కువగా డిజిటిల్‌ డైరీ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ.. చేతిరాత డైరీ పట్ల ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. జ్ఞాపకాలు, అనుభూతులు, భావితరాలు చూసే అవకాశం ఉండటం మూలంగానే ఎందరో మహనీయుల ఆత్మకథలు, అనుభవాలు, మనం చూడ గలిగా ం. వారి భావనలు, ఆశయాలు పంచుకోగలుగుతున్నాం. అందుకే ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలు మొదలుకొని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ప్రత్యేకంగా డైరీలు ముద్రించి పంపిణీ చేస్తుండటం గమనార్హం.

వ్యక్తిత్వ వికాసం పెరుగుదల..

మధుర భావనలను విశ్లేషించడానికి అనుభవాలసారంతో జీవన గమ్యాలను నిర్ధేశించుకోవడానికి స్వేచ్ఛగా భావాలను అక్షర నిక్షిప్తం చేసే ఏకైక సాధనం డైరీ. డైరీ రాసే అలవాటు ఉన్న వారిలో మంచి రచణ నైపుణ్యంతో పాటు అంతర్లీన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే భావావేశం ఉంటుంది. డైరీ రాయడంలో ప్రత్యేకత ఏమిటంటే దశాబ్దాలు గడిచినా తరాలు మారినా తిరిగి వాటిని చదువుకునే అవకాశం, జ్ఞాపకా లు అనుబూతులు ఆస్వాదించే అవకాశం ఉంటాయి. భావప్రకటన స్వేచ్ఛతో పాటు రచణ నైపుణ్యాలు మెరుగు పరుచుకోవాడానికి అవకాశముంటుంది. అంతేకాదు. డైరీలో రాసే ప్రతి అంశం మన ఆలోచనల్లో నిజాయితీని మరిచిపోకుడదనే విషయా లు పంచుకునేందుకు సురక్షితమైన స్థలంగా భావిస్తుంటారు. సృజనాత్మకతతో కూడిన అంశాలు భావ వ్యక్తీకరణలు డైరీ ద్వారా మనో వికాసాన్ని కలగజేస్తాయని భావిస్తుం టారు.

డైరీ రాయడం అనేక రకాలు..

నవీన కాలంలో అనేక మంది వివిధ రకాల అంశాలు గుర్తుంచుకోవడానికి డైరీల్లో రాసుకోవడం తెలిసిందే. పాఠశాలల డైరీల్లో విద్యాసంబంధ వివరాలు, విద్యార్థుల పురోగతి, మార్కులు, బోధనాంశాలు ఇతర కార్యకలాపాలు నమోదు చేస్తుంటారు. మెడికల్‌ డైరీలు రాసే వారు వ్యక్తిగత ఆరోగ్యసంబంధ అంశాలు, వినియోగించే ఔషధాలు, వైద్య పరీక్షల సమచారాలు, కుటుంబ వైద్యుల వివరాలు, పిట్‌నెస్‌ల గురించి రాయడం కనిపిస్తుంది. ట్రావెల్‌ డైరీల్లో ఆహ్లాదకర ప్రదేశాల సందర్భనలు ప్రయాణాల అనుభవాలు, బంధువులు, స్నేహితులతో గడిపిన సన్నివేశాల గురించి, ఉద్యోగులు తాము నిర్వహించాల్సిన పనులు, విధులు, అపాయింట్‌మెంట్‌లు, కార్యాల యాల్లో పనులు గురించి, టూర్‌ల గురించి రాస్తుంటారు. కాగా గృహిణిలు సైతం తమ నివాస గృహాల్లో సమాచారాలతో పాటు పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ రకాల చెల్లింపులు నమోదు చేయడం కనిపిస్తుంటుంది. వీటి ద్వారా అనేక విషయాలు గుర్తు పెట్టుకోవడం, విధులు, బాధ్యతల్లో మంచి స్నేహితుడిగా డైరీ తోడ్పడుతుంది. ఉరుకులు, పరుగులతో పెనవేసుకున్న నేటి కాలంలో టాస్క్‌లు గుర్తుచేసే ప్రక్రియగా డైరీ రాసే ప్రాధాన్యం బాద్యతగా మారిందనడం అతిశ యోక్తికాదు. కాలానుగుణంగా డైరీ సైతం అనేక మార్పులకు గురవుతుంది. ఆత్మ పరిశీలనగా.. దైనందిన ప్రక్రియగా రాస్తున్న డైరీకి దీటుగా డిజిటల్‌ డైరీ ప్రాముఖ్యత పెరిగింది. దీనిలో సైతం తమ జ్ఞాపకాలు, అనుభూతులు, ఈవెంట్ల సమాచారం రికార్డు చేస్తున్నారు. అంతేకాక డిజిటల్‌ డైరీ ఇతరులు చూసే అవకాశం ఉండదు. ప్రత్యేకంగా పాస్‌వర్డ్‌ ఏర్పాటు చేసుకోవడం మూలంగా సంబంధి వ్యక్తి మినహా ఇతరులు చూడలేదు. ల్యాప్‌టాప్‌లు, ఐ ప్యాడ్‌, మోబైల్‌ వినియోగం పెరగడంతో పరిజ్ఞానం కలిగిన వారు డిజిటల్‌ డైరీల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాక ఆసక్తి ప్రాధాన్యతల ఫొటోలను సైతం భద్రపరుచుకునే అవకాశం డిజిటల్‌ డైరీలో లభ్యమవుతుండటంతో వీటి ప్రాముఖ్యత పెరిగింది..

డిప్రెషన్ ను తొలగించే మానస చికిత్స

నేటి కాలంలో అనేక మంది తీవ్రమైన డిప్రెషన్ కు గురికావడం, అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వంటరిగా బావిస్తున్న వారికి డైరీ ప్రియనేస్తంగా మారింది. డిప్రెషనకు గురైన వ్యక్తులు తమలోని భావాలను వ్యక్తపరచడం ద్వారా నిరాష భావాలను తగ్గించడంలో డైరీ రాసే అలవాటు తోడ్పడుతుందని వైద్యులు సూ చిస్తున్నారు. డిప్రెషన్ లో ఉన్నవారి మనస్సులో ఏం జరుగుతుందో.. వారిలో సంఘర్షణకు గురి చేసే అంశాలు ఏమిటో గుర్తించటానికి తమ నిరుత్సాహాన్ని దూరం చేసే అంశాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉండటంతో వారికి సాంత్వన లభించే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. అంతేకాక డైరీ రాయడం ద్వారా వారి మానసిక స్థితిని పరిశీలించి వారికి సానుకూల పరిస్థితులు నెలకొల్ప డానికి సైతం డైరీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.