Shraddhadas : శ్రద్ధ దాస్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే ఆమె స్టార్ కాలేకపోయింది. ఆకర్షించే అందం ఉన్నా… ఓ స్థాయి హీరోయిన్ కాలేకపోయింది. అల్లరి నరేష్ హీరోగా విడుదలైన సిద్ధు ఫ్రమ్ సీకాకుళం చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్. ఆ మూవీలో శ్రద్దా దాస్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. 2008లో ఆ చిత్రం విడుదలైంది. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో జస్ట్ వ్యాంప్ రోల్స్ చేసింది.
ఆర్య 2 చిత్రంలో ఆమె అల్లు అర్జున్ ని ఇష్టపడే కొలీగ్ రోల్ చేసింది. ఇక డార్లింగ్ మూవీలో ప్రభాస్ కోసం సూసైడ్ చేసుకునే విలన్ కూతురు పాత్ర చేసింది. ఈ సినిమాలు హిట్ అయినా ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. చిన్న చిన్న హీరోలతో లేదా సెకండ్ హీరోయిన్స్ ఆఫర్స్ మాత్రమే వ్ వచ్చాయి.
ఇటీవల ఒక మినీ కథ పేరుతో అడల్ట్ కామెడీ మూవీలో నటించింది. సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. శ్రద్దా దాస్ గ్లామరస్ రోల్ చేసింది. ఆ సినిమా హిట్ కావడంతో శ్రద్ధ దాస్ కి కొంత ఫేమ్ వచ్చింది. అయినా కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. శ్రద్దా దాస్ బిగ్ బాస్ షోకి వస్తారంటూ గతంలో పుకార్లు లేచాయి. ఈ పుకార్లను శ్రద్దా దాస్ కొట్టిపారేసింది. పలు భాషల్లో నేను సినిమాలు చేస్తూ బిజీ, నేనెందుకు బిగ్ బాస్ షోకి వెళతాను అన్నారు.
సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది. తాజాగా పొట్టిబట్టలు ధరించి యోగాసనాలు వేసింది. ఆమె ఫోజులు చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్దా దాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అమ్మడు సింగర్ కూడాను. దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి సింగింగ్ షోలు చేస్తూ ఉంటుంది.