Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డిసెంబర్ 17న షో ను గ్రాండ్ గా ముగించారు నిర్వాహకులు. కాగా కామన్ ఆడియన్స్ తో పాటు పెద్ద సెలెబ్రెటీలు కూడా బిగ్ బాస్ సీజన్ 7 ని ఫాలో అయ్యేవారట. అందులో మెగా స్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆయన సతీసమేతంగా డైలీ బిగ్ బాస్ చూసేవారట. ముఖ్యంగా ఆ కంటెస్టెంట్ కోసం ఆయన బిగ్ బాస్ 7 మిస్ అవ్వకుండా ఫాలో అయ్యారంట.
బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో కంటెస్టెంట్స్ కు బాగా ఫేమ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఫైనల్స్ కు చేరుకున్న శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, ప్రియాంక, అర్జున్ లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్న శివాజీ కనీసం టాప్ 2 లో ఉంటాడని అంతా భావించారు. అనూహ్యంగా మూడో స్థానంలో నిలిచాడు.
ఇది ఇలా ఉండగా .. బిగ్ బాస్ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శివాజీ ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో శివాజీ మాట్లాడుతూ .. నేను నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఓ ఈవెంట్ కి హాజరయ్యాను. అక్కడ చిరంజీవి అన్నయ్య ఉన్నారు. నేను పలకరించాను. అప్పుడు చిరంజీవి అన్నయ్య .. నీ కోసం నేను సురేఖ రోజూ బిగ్ బాస్ షో చూసేవాళ్ళం. చాలా బాగా ఆడావు అన్నారు.
ఏంటన్నయ్య .. నా కోసం మీరు బిగ్ బాస్ షో చూశారా అని ఆశ్చర్యంగా అడిగాను. అవును .. అని చిరంజీవి సమాధానం చెప్పారు అని శివాజీ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి శివాజీకి నటుడిగా మంచి పేరుంది. అనూహ్యంగా యాక్టింగ్ కి దూరమయ్యాడు. శివాజీ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో జనాల్లో అతనిపై నెగిటివిటీ వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా దాన్ని చాలా వరకు పోగొట్టుకున్నాడు. ఫలితంగా శివాజీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది.